Aurangzeb tomb: ఔరంగజేబు సమాధి వివాదం ఏంటి ? చరిత్రలో ఏం జరిగింది ?

మహారాష్ట్రలోని ఔరాంగాబాద్ జిల్లాలోని ఖుల్దాబాద్ లో ఉన్న ఔరంగజేబు సమాధి ఇప్పుడు మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. అంతే కాదు ఇరు వర్గాల మధ్య ఘర్షణలు, తీవ్ర ఉద్రిక్తతలకూ దారి తీసింది. ఛావా సినిమా విడుదల తర్వాత జనం మనోభాల్ని దృష్టిలో ఉంచుకుని ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తామంటూ గతంలో ప్రకటించిన బీజేపీ నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్న మహారాష్ట్రలో పరిస్ధితిని ఎలా నియంత్రించాలో తెలియక తలపట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఔరంగజేబు సమాధి వివాదం ఎలా మొదలై, ఎలా సాగుతోందో ఓసారి చూద్దాం..

ఆరో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు 1707 మార్చిలో అహ్మద్ నగర్ లో చనిపోయాడు. దీంతో అదే రోజు ఆయన కోరిక మేరకు ఔరంగాబాద్ లో ఉన్న ఖుల్దాబాద్ లోని షేక్ జైనుద్దీన్ దర్గా ప్రాంగణంలో ఆయన్ను సమాధి చేశారు. ఈ సమాధికి అయిన ఖర్చును కూడా ఔరంగజేబు ముందే టోపీలు కుట్టి మరీ సంపాదించి పోగు చేశాడు. అలాగే తన సమాధి ఎలా ఉండాలో కూడా ఆయన ముందే ఆదేశాలు ఇచ్చి వెళ్లాడు. దీంతో దీనికి అనుగుణంగానే సాదాసీదాగా ఈ సమాధి నిర్మించారు.

What is Aurangzeb tomb row here is controversy before and after chavva movie

సమాధి పైన ఎర్ర రాయితో నిర్మించిన ఒక వేదిక ఉంది. దాని పొడవు మూడు గజాల కంటే తక్కువే. మధ్యలో కొన్ని వేళ్లు కొలిచే కుహరం కూడా ఉంది. అతని సోదరి జహానారా బేగం సమాధి నుండి ప్రేరణ పొంది దీన్ని మూలికలు పెరిగే మట్టితో కప్పారు. ఔరంగజేబు మరణానంతరం ఆయనకు ఖుల్ద్-మకాన్" ("శాశ్వతంగా నివాసం ఉన్నవాడు") అనే బిరుదు కూడా ఇచ్చారు. లార్డ్ కర్జన్ తరువాత ఆ ప్రదేశాన్ని పాలరాయితో కప్పాడు. అలాగే దానికి పాలరాయి తెరతో చుట్టి ఉంచాడు. ఆ తర్వాత 1760లో దీనికి గేట్‌వే, గోపురం ఉన్న వాకిలి ఏర్పాటు చేశారు.

ఔరంగజేబు చనిపోయక ముందు తన చివరి రోజుల్లో తన సమాధి స్థలానికి టోపీలు కుట్టడం ద్వారా డబ్బు పోగు చేసి ఇచ్చాడని చెబుతారరు. అప్పట్లో దీనికి అయిన ఖర్చు కేవలం 14 రూపాయల 12 అణాలు మాత్రమే. ఆ సమాధి ఔరంగజేబు సూచనలకు అనుగుణంగా చాలా సింపుల్ గానే కట్టారు. ఔరంగజేబు పూర్తి పేరు సమాధి యొక్క ఒక మూలలో ఉన్న పాలరాయి పలకపై రాసి ఉంటుంది. దీన్ని అప్పటి నుంచీ లక్షల మంది దర్శించుకుంటూనే ఉన్నారు.

అయితే తాజాగా మరాఠా దిగ్గజం ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీని ఉరితీయాలని ఔరంగజేబు ఇచ్చిన ఆదేశాలను తాజాగా విడుదలైన బాలీవుడ్ చిత్రం ఛావాలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. దీంతో తాజాగా ఈ సమాధిపై వివాదం మొదలైంది. చావా సినిమాలోని కొన్ని అంశాలను తప్పుగా చిత్రీకరించారని, ఔరంగజేబు మంచి పాలకుడు అని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ పొగడటంతో ఆయన్ను మహారాష్ట్ర అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. తాను నేను ఔరంగజేబును క్రూరమైన పాలకుడిగా పరిగణించనని, ఛావా చిత్రంలో చరిత్ర వక్రీకరించారని అజ్మీ చెప్పారు. ఔరంగజేబు అనేక దేవాలయాలను నిర్మించాడని గుర్తుచేశారు. దీంతో ఈ వివాదం పెరుగుతూ పోయి ఘర్షణల వరకూ వచ్చేసింది. అయితే 2015లోనే ఈ వివాదానికి బీజం పడింది.

2015లో హైకోర్టు ఆదేశాల మేరకు ఔరంగాబాద్‌లో జిల్లా కలెక్టర్ చేపట్టిన కూల్చివేత కార్యక్రమంలో కొన్ని దేవాలయాలను ధ్వంసం చేసినందుకు, శివసేన ఎంపీ ఒకరు విధుల్లో ఉన్న అధికారిని "ఔరంగజేబ్ కి ఔలాద్" (ఔరంగజేబ్ వారసుడు) అంటూ దూషించారు. దీనిపై అప్పట్లో తీవ్ర వివాదం నెలకొంది. ఆ తర్వాత అదే ఏడాది ఢిల్లీలోని కాళింది కుంజ్ నుండి జామియా నగర్ వరకు స్థానికంగా 'పుష్తా రోడ్డు' అని పిలిచే 3కిలోమీటర్ల రోడ్డును కాంగ్రెస్ పార్టీ ఓఖ్లా మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ మహమ్మద్ ఖాన్ 'ఔరంగజేబ్ రోడ్డు' అని పేరు పెట్టారు. దీంతో అప్పటి తూర్పు ఢిల్లీ ఎంపీ మహేష్ గిరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఔరంగజేబ్ రోడ్డు పేరు మార్చాలని లేఖ రాశారు. కొన్ని నెలల్లోనే, రోడ్డు పేరు మార్చే ప్రతిపాదనను ఢిల్లీ కార్పోరేషన్ ఆమోదించింది.

2022లో ఔరంగజేబ్ రోడ్డు మాదిరిగానే ఔరంగజేబ్ లేన్‌కు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. అదే ఏడాది మేలో ఔరంగాబాద్ సమీపంలోని ఖుల్దాబాద్‌లోని ఔరంగజేబు సమాధి వద్ద నివాళులు అర్పించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై మరాఠా అనుకూల సంస్థలు మండిపడ్డాయి. ఆయన ఔరంగజేబు సమాధిని సందర్శించడంపై శివసేన , మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో భారత పురావస్తు సర్వే ఔరంగజేబు సమాధిని ఐదు రోజుల పాటు మూసివేసింది. అప్పుడే ఎంఎన్ఎస్ నేత గజానన్ కాలే దానిని నాశనం చేయాలని సూచించారు.

Take a Poll

తిరిగి 2023 జూన్ లో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఊరేగింపు సందర్భంగా ఔరంగజేబు పోస్టర్లు వెలిశాయి. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఔరంగజేబు పోస్టర్‌ను పట్టుకున్న వ్యక్తిని చూపించే వీడియో వైరల్ కావడంతో నలుగురిని అరెస్టు చేశారు.ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 17న నాగ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఇందులో 30 మందికి పైగా గాయపడ్డారు. శంభాజీ నగర్‌లోని ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు నిరసన నిర్వహించిన కొన్ని గంటల తర్వాత దీనికి ప్లాన్ జరిగినట్లు బిజెపి ఆరోపిస్తోంది.దాదాపు 60 నుండి 65 మందిని అల్లర్లకు కారకులుగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘర్షణల్లో 25 నుండి 30 మంది పోలీసులు గాయపడ్డారు. హింస కారణంగా 25 బైక్‌లు, మూడు కార్లు దగ్ధమయ్యాయి.దీనిపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం కూడా తీవ్రంగా సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+