Atiq Ahmed: బాడీల్లో బుల్లెట్లు దింపిన ఆ ముగ్గురు వీళ్లే
లక్నో: గ్యాంగ్‌స్టర్, లోక్‌సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్‌ను దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ కూడా మరణించారు. ముగ్గురు వ్యక్తులు అతి సమీపం నుంచి వారిద్దరిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్ అక్కడికక్కడే మరణించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇటీవలే అతిక్ అహ్మద్ కుమారుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అతని అంత్యక్రియలు ముగిసిన వేళ- అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్‌పై కాల్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనతో ప్రయాగ్ రాజ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిద్దరినీ మెడికల్ చెకప్ కోసం ఆసుపత్రికి తరలిస్తోన్న సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు నిర్ధారించారు.

అత్యంత సమీపం నుంచి అంటే పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి వారిద్దరిపైనా బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో- పోలీసులు అందరూ చూస్తోండగానే అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్‌పై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. అతిక్ అహ్మద్ తలపై తుపాకీని పెట్టి కాల్పులు జరిపాడొకడు. ఆ వెంటనే అతిక్ కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న అష్రాఫ్ అహ్మద్‌పై కాల్పులు జరిపారు.
ఊహించని ఈ ఘటనతో పోలీసులు దూరంగా వెళ్లిపోయారు. నేలపై కుప్పకూలిన అతిక్ అహ్మద్, అతని సోదరుడిపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. వారు మరణించారని నిర్ధారించుకున్న తరువాతే అక్కడి నుంచి పారిపోయారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడినట్లు ప్రయాగ్ రాజ్ పోలీసులు నిర్ధారించారు. వారిని అరెస్ట్ చేశారు.
వారిని లవ్‌లేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యగా గుర్తించారు పోలీసులు. కాల్పులు జరడానికి ఉపయోగించిన తుపాకీ, ఖాళీ బుల్లెట్ మ్యాగజైన్లు, వారు ప్రయాణించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులు, ప్రయాగ్ రాజ్ జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ ఖత్రి, నగర పోలీస్ కమిషనర్ రమిత్ శర్మ సంఘటన స్థలానికి చేరుకున్నారు.
పోలీసుల విచారణలో వారు తమ నేరాన్ని అంగీకరించారు. తమ స్వస్థలాల వివరాలను వెల్లడించారు. ఈ ముగ్గురు కూడా ప్రయాగ్ రాజ్‌కు చెందిన వారు కాదు. లవ్‌లేష్ తివారీ స్వస్థలం బందా. అరుణ్ మౌర్య సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ అతని స్వస్థలం. ఉత్తర ప్రదేశ్‌కే చెందిన కాస్ గంజ్‌కు చెందిన వ్యక్తి సన్నీ. పోలీసుల విచారణలో వారు తమ నేరాన్ని అంగీకరించారు. తమ స్వస్థలాల వివరాలను వెల్లడించారు.
నహీ లే గయే తో నహీ గయే (వారు మమ్మల్ని తీసుకెళ్లలేదు, అందుకే వెళ్లలేదు).. ఇవే అతీక్ అహ్మద్ చివరి మాటలు. తన కుమారుడు అసద్ అంత్యక్రియలకు హాజరు కావడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం పట్ల విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. దీనికి కారణం గుడ్డూ (అసద్) ముస్లిం కావడమే..అంటూ అష్రాఫ్ బదులిచ్చారు. వారు మాట్లాడుతుండగానే బుల్లెట్ల వర్షం కురిసింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications