వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీట్ల కేటాయింపులో సైన్స్! రైళ్లలో బెర్త్‌లు ఎలా ఇస్తారో తెలుసా?

ప్రయాణికుల బరువును అన్ని కాంపార్ట్ మెంట్ లలో.. అన్నివైపులా సమానంగా పంచేలా ఐఆర్సీటీసీకి సంబంధించిన సాఫ్ట్ వేర్ టిక్కెట్ లను బుక్ చేస్తుంది. ఒక రైలులో 10 స్లీపర్ క్లాస్ కోచ్ లు (ఎస్‌ 1- ఎస్‌10) ఉన్నాయన

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బస్సుల్లో, సినిమా థియేటర్లలో మనం మనకు నచ్చిన సీటును ఆన్ లైన్ లో బుక్ చేసుకోగలం. కానీ రైలులో మాత్రం ఆ సదుపాయం లేదు, ఎందుకని? టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్ లో క్లర్క్ ను రిక్వెస్ట్ చేసినా సాధ్యం కాదు, ఎందుకని?

రైళ్లలో ఐఆర్సీటీసీ కేటాయించిన సీట్లలోనే ప్రయాణికులు కూర్చోవలసి ఉంటుంది. విండోసీటు దొరకలేదని ప్రయాణికులు కొందరు చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. రైల్వే శాఖను, రిజర్వేషన్ కౌంటర్ క్లర్కులను నిందిస్తూ ఉంటారు.

Why IRCTC(Indian Railway) does not allow you to choose seats in Trains?

కానీ ఇక్కడే ప్రయాణికులకు తెలియని విషయం ఒకటుంది. రైళ్లలో సీట్లు, బెర్త్ ల కేటాయింపు ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. సీట్లు, బెర్త్ ల కేటాయింపు వెనుక సైన్స్ ఉంటుంది.

ప్రయాణికుల బరువును అన్ని కాంపార్ట్ మెంట్ లలో.. అన్నివైపులా సమానంగా పంచేలా ఐఆర్సీటీసీకి సంబంధించిన సాఫ్ట్ వేర్ టిక్కెట్ లను బుక్ చేస్తుంది. ఒక రైలులో 10 స్లీపర్ క్లాస్ కోచ్ లు (ఎస్‌ 1- ఎస్‌10) ఉన్నాయనుకుంటే.. ఒక్కో కోచ్ లో 72 సీట్లతో మొత్తం స్లీపర్ కోచ్ లలో 720 సీట్లు ఉంటాయి.

మొదటగా బుక్ చేసుకునే వ్యక్తికి మధ్య భాగంలో అంటే ఎస్-5 బోగీలో సీటును కేటాయిస్తుంది ఐఆర్సీటీసీ సాఫ్ట్ వేర్. చివరగా బుక్ చేసుకున్న వ్యక్తికి ఎస్-1 లేదా ఎస్-10 బోగీలో సీటును కేటాయిస్తుంది.

బెర్త్ ల విషయంలోనూ తొలుత లోయర్ బెర్త్.. తరువాత మిడిల్ బెర్త్.. చివర్న అప్పర్ బెర్త్ కేటాయిస్తుంది. ఇలా ఒక క్రమపద్ధతిలో కాకుండా ఎలాబడితే అలా టిక్కెట్లు, బెర్త్ లు కేటాయిస్తే.. కొన్ని బోగీలు పూర్తిగా నిండిపోయి, మరికొన్ని బోగీలు ఖాళీలతో ఉండే అవకాశం ఏర్పడుతుంది.

అంతేకాదు, దీనివల్ల కొన్ని బోగీల్లోనే ప్రయాణికుల బరువు అధికంగా ఉండి, మరికొన్ని బోగీల్లో తక్కువగా ఉండడం వల్ల రైలు ప్రయాణిస్తున్నప్పుడు మలుపుల వద్ద రైలు పట్టాలు తప్పే అవకాశం అధికంగా ఉంటుంది. ఇలా జరగకుడా ఉండడం కోసమే ఒక పద్ధతి ప్రకారం రైలు బోగీల్లో సీట్లు, బెర్త్ ల కేటాయింపు జరుగుతుంది.

English summary
Why IRCTC(Indian Railway) does not allow you to choose seats? Would you believe that the technical reason behind this is PHYSICS. Booking a seat in a train is far more different than booking a seat in a theatre. Theatre is a hall, whereas train is a moving object. So safety concern is very high in trains. Indian railways ticket booking software is designed in such a way that it will book tickets in a manner that will distribute the load evenly in a train.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X