‘గురు’ చెప్పాడని ‘సెక్స్’కి దూరం: భర్త విడాకులు

ముంబై: భర్త కోరుకున్న విధంగా లైంగిక జీవితాన్ని అందించడంలో విఫలమైన భార్య చర్యలను తప్పుబడుతూ, ముంబైలోని బాంద్రా సెషన్స్ కోర్టు ఓ యువకుడికి విడాకులు మంజూరు చేసింది. ఆసక్తికరమైన ఈ కేసు వివరాల్లోకి వెళితే.. బాధిత యువకుడికి 2011లో వివాహం అయింది.

సాధ్యమైనంత త్వరగా పిల్లలను కనాలన్నది అతని కోరిక. అయితే ఆమె మాత్రం అందుకు నిరాకరించింది. తొలిరాత్రే ప్యాకెట్ల కొద్దీ కండోంలు తీసుకొచ్చిందట. తనకు పిల్లలు వద్దని తెగేసి చెప్పిందట.

అంతేగాక, ఆమె ఓ స్వామిజీని తన గురువుగా భావించి అతడు చెప్పినట్లుగా వింటోందని భర్త తెలిపాడు. ఆమె చేష్టలతో విసిగిపోయిన అతడు విడాకుల కోసం చివరకు కోర్టును ఆశ్రయించాడు.

Wife follows Guru's advice, refuses to have sex; Mumbai man gets divorce

కాగా, తన భర్త అసహజ శృంగారాన్ని కోరుతున్నాడని కోర్టులో ఆమె వాదించింది. ఇరువురి వాదనలు విన్నకోర్టు, ఆమె వాదన సరిగ్గా లేదని అభిప్రాయపడింది. ఈ కేసులో భర్త మానసిక వేదన కనిపిస్తోందని, ఆయన విడాకులు పొందేందుకు అర్హుడని న్యాయమూర్తి ఎస్ఏ మోరే అభిప్రాయపడ్డారు.

వివాహం చేసుకుని సుఖపడాలన్న యువకుడి కోరికలు ఆమె వల్ల నిష్ఫలమయ్యాయని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతేగాక, ఆమె అతడ్ని మానసికంగా హింసకు గురి చేసిందని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+