అడ్డంగా దొరికిపోయిన సోనమ్ కపూర్..చిన్న మిస్టేక్‌తో పోలీసుల చేతికి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రఘువంశీ, సోనమ్ కపూర్ దంపతుల హనీమూన్ ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. మే 11న గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న ఈ జంట, మే 20న హనీమూన్‌కు బయలుదేరారు. మొదట కశ్మీర్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నా, తర్వాత మనసు మార్చుకుని మేఘాలయకు వెళ్లారు. అయితే, మే 18న రాజ్ కుశ్వాహా హత్య గావించబడ్డాడు. పోస్ట్‌మార్టంలో అతని తలపై బలమైన గాయాలున్నట్లు బయటపడింది.
ఈ ఘటన జరిగినప్పటి నుంచి సోనమ్ కనిపించకుండా పోయింది. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా, సోనమ్ తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అర్ధరాత్రి ఒక దాబా వద్ద ప్రత్యక్షమైంది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని ఆమె చెప్పగా, ఆ దాబా యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

రఘువంశీ హత్య కేసులో సోనమ్, ఆమె ప్రియుడి హస్తముందని రఘువంశీ సోదరుడు ఆరోపించాడు. పోలీసులు వారి మధ్య జరిగిన వాట్సాప్ కాల్స్, ఫోన్ సంభాషణలను గుర్తించారు. అంతేకాకుండా, హత్య జరగడానికి ముందు సోనమ్ ముగ్గురు యువకులతో కనిపించిందని వారితో ఉన్న గైడ్ పోలీసులకు చెప్పడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తాజాగా, హత్య జరగడానికి ముందు ఆ ముగ్గురు యువకుల ఫోన్ కాల్ లొకేషన్, సోనమ్ లొకేషన్ ఒకే టవర్ కింద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
దీనిని బట్టి సోనమ్, ఆమె ప్రియుడి పథకం ప్రకారమే ఈ దారుణం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సోనమ్‌కు ఈ పెళ్లి ఇష్టం లేదని, రఘువంశీని చంపేసి, ఆ తర్వాత ప్రియుడితో కలిసి మరో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications