"అమెరికాతో యుద్దం వస్తే పాకిస్తాన్ కు మద్దతు..! "- రాజస్థాన్ బీజేపీ ఛీఫ్ షాకింగ్..!
పాకిస్తాన్ (Pakistan) పేరు చెబితేనే భారతీయులు మండిపడుతుంటారు. బీజేపీ (BJP) నేతలైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఓ బీజేపీ నేత, అదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడితే.. ఊహాతీతమైన ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో పాటు రాజకీయ దుమారాన్ని రేపాయి. అమెరికాతో యుద్దం వస్తే పాకిస్తాన్ కు మద్దతిస్తామంటూ మదన్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల్ని సొంత పార్టీ బీజేపీతో పాటు అన్ని పార్టీలు తప్పుబడుతున్నాయి.
పాకిస్థాన్, అమెరికాల మధ్య యుద్ధం జరిగితే.. భారత్.. పాకిస్థాన్కు మద్దతు ఇస్తుందని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కూడా అయిన మదన్ రాథోడ్ వ్యాఖ్యానించారు. రాజస్తాన్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాథోడ్ తన వాదనను సమర్థించుకుంటూ, భౌగోళిక సామీప్యత దృష్ట్యా పాకిస్థాన్ పొరుగు దేశం కాబట్ట భారత్ దానికి మద్దతు ఇస్తుందని చెప్పారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ చర్చకు ఇవి దారి తీశాయి.

“IF AMERICA ATTACKS PAKISTAN, WE’LL SIDE WITH PAKISTAN.”Not an opposition leader speaking.That’s Rajasthan BJP chief Madan Rathore.Quite a statement, isn't it?🤡 https://t.co/9x2RcuqygD
— Batman (@BatPhoenix07) October 16, 2026
రాజస్తాన్ బీజేపీ ఛీఫ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. బీజేపీ విదేశాంగ విధాన వైఖరిని ఆ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఒక సంఘర్షణ సమయంలో పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వడంపై రాథోడ్ దృక్పథంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏకీభవిస్తున్నారా అని సీనియర్ కాంగ్రెస్ కోఆర్డినేటర్లు సూటిగా ప్రశ్నించారు. భారత పౌరులు, సైనిక సిబ్బందిపై ప్రభుత్వ ప్రాయోజిత సరిహద్దు ఉగ్రవాదానికి పదేపదే పాల్పడుతున్న దేశం పట్ల బీజేపీ అంతర్లీనంగా అనుబంధాన్ని ప్రదర్శిస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఒకే రకమైన భావజాలం అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విమర్శలు గుప్పిస్తోంది. ఈ వివాదాస్పద వ్యాఖ్యల క్లిప్పై సోషల్ మీడియా యూజర్లు కూడా తీవ్రంగా స్పందించారు. ప్రపంచ అగ్రరాజ్యమైన దేశంతో కాకుండా, చారిత్రక శత్రువుతో దౌత్య పొత్తును ప్రతిపాదించినందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని టార్గెట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
