వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా బీభత్సం .. ఇండియాలో 8 లక్షలు ,ఒక్కరోజులో 27వేలకు పైగా .. ప్రపంచంలో కోటి 26 లక్షలకు పైగా

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా పెరుగుతున్న కేసులు భారతదేశ పరిస్థితిని దయనీయంగా మారుస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ పట్టికలో కరోనా కేసులలో ఇండియా మూడవ స్థానంలో ఉంది. ఇండియాలో కరోనా కేసులు ఎనిమిది లక్షలు దాటిన పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో ఒకేరోజులో 27 వేలకు పైగా కేసులు నమోదు కూడా రికార్డు సృష్టించింది . ప్రపంచంలో కూడా కరోనా భయానక పరిస్థితి తీసుకువస్తుంది .

Recommended Video

COVID-19 : India లో రికార్డు స్థాయిలో Corona కేసులు.. భయాందోళనలో ప్రజలు! || Oneindia Telugu

ఆ ప్రాంతాల్లో గాలిద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న డబ్ల్యూహెచ్ఓ .. కాపాడుకోవటం ఎలా ?ఆ ప్రాంతాల్లో గాలిద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న డబ్ల్యూహెచ్ఓ .. కాపాడుకోవటం ఎలా ?

గత 24 గంటల్లో ఇండియాలో 27,114 కేసులు.. రికార్డు బ్రేక్

గత 24 గంటల్లో ఇండియాలో 27,114 కేసులు.. రికార్డు బ్రేక్

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో ఇండియాలో 27,114 కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులలో కూడా ఇండియా తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ దారుణ స్థితి దిశగా వెళుతోంది. ఇప్పటి వరకు ఇండియాలో నమోదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,20,916 కాగా ఇందులో 2,83,407 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొని 5,15,385 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇండియాలో రికవరీ రేటు 62.78 శాతం

ఇండియాలో రికవరీ రేటు 62.78 శాతం

కరోనా మరణాల సంఖ్య చూస్తే గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 519 మంది మృత్యువాత పడ్డారు.దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 22,123 కు చేరింది. ఇండియాలో గడచిన 24 గంటల్లో 2,82,511 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగినట్లుగా ఐసిఎంఆర్ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇండియాలో మొత్తంగా ఒక కోటి 13 లక్షల ఏడువేల రెండు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఇండియాలో రికవరీ రేటు చూసినట్లయితే 62.78 శాతంగా ఉందని తెలుస్తుంది.

 ప్రపంచ వ్యాప్తంగా కోటి 26 లక్షలకు పైగా కరోనా బాధితులు

ప్రపంచ వ్యాప్తంగా కోటి 26 లక్షలకు పైగా కరోనా బాధితులు

ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా పంజా విసురుతుంది. రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1,26,25,860కి చేరింది. అలాగే మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి ఇప్పటి వరకు 5,62,820 లక్షల మంది మృతి చెందారు. దాదాపుగా 73,61,659 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు చూసినట్లయితే అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతోంది. బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా మూడో స్థానంలో ఇండియా ఉంది.

అమెరికాలో కరోనా బీభత్సం ... 24 గంటల్లో 70 వేలకు పైగా కేసులు

అమెరికాలో కరోనా బీభత్సం ... 24 గంటల్లో 70 వేలకు పైగా కేసులు

అమెరికాలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది . 32,91,786 కేసులు నమోదు కాగా, బ్రెజిల్ లో 18,04,338 కేసులు నమోదయ్యాయి. గ‌డ‌చిన‌ 24 గంటల్లో అమెరికాలో 70వేల‌కు మించి కరోనా కేసులు నమోదయ్యాయి. ఏ దేశంలోనూ లేనంత రీతిలో అమెరికాలో ఒక్క రోజులో అత్య‌ధిక కేసులు న‌మోద‌య్యాయి. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం అమెరికాలో ఇప్పటివరకు 31,83,856 మంది కరోనాతో బాధపడుతున్నారు. రోజు రోజుకూ కరోనా కట్టడి చెయ్యలేని స్థితి ప్రపంచ దేశాలకు ప్రాణ సంకటంగా తయారైంది. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం చిగురుటాకులా వణుకుతుంది .

English summary
India’s COVID-19 cases crossed the 8 lakh-mark with 27,114 cases and 519 deaths reported in the last 24 hours across the country. Now the total number of positive cases stand at 8,20,916 including 2,2123 fatalities, 2,83,407 active cases, and 5,15,386 recoveries, according to data released by the Ministry of Health and Family Welfare. India is the third worst-hit nation, behind only the United States and Brazil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X