Work-Life Balance: వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ! చైనాకూ, మనకూ ఎంత తేడా ?

పని-జీవిత సమతౌల్యత విషయంలో భారతీయులకూ, చైనీయులకూ పూర్తిగా తేడా ఉంది. దీనిపై ఓ భారతీయ సీఈవోకు చైనా వ్యాపారవేత్త ఇచ్చిన సమాధానం చర్చకు దారి తీస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులపై ఎప్పుడూ పని ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. కార్పోరేట్ సంస్థల ఉద్యోగుల పరిస్ధితి చెప్పాల్సిన అవసరమే లేదు. భారత్ వంటి భారీ మార్కెట్ కలిగిన దేశాల్లో ఉద్యోగులు అటు ఉద్యోగాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ ( work-life balance) చేయలేక పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. కానీ మన పొరుగునే ఉన్న చైనాలో ఉద్యోగులు మాత్రం ఈ సమస్యకు వెతుక్కున్న పరిష్కారం ఏంటో చూస్తే మన వాళ్లకు కచ్చితంగా ఆశ్చర్యం అనిపించక మానదు. ఇలాంటిదే ఓ ఘటన తాజాగా జరిగింది.

పని-జీవిత సమతౌల్యత (work-life balance)

భారత్ కు చెందిన ఎనర్జీ ఏఐ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, సీఈవో శుభం మిశ్రా.. తన కొత్త చైనీస్ పార్టనర్ తో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై ఎక్స్ లో జరిపిన సంభాషణను షేర్ చేశారు. ఇందులో భారత్, చైనా సంస్కృతుల్లో అతిపెద్ద తేడా ఏమిటని మిశ్రా ప్రశ్నించగా.. ఆ చైనీస్ వ్యాపారవేత్త తాత్వికంగా సమాధానం ఇస్తాడని అనుకున్నారు. కానీ దానికి బదులు అత్యంత నిష్కర్షగా, ఆచరణాత్మకమైన జవాబు ఇచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం మన సీఈవో గారి వంతయింది.

Work-Life Balance Debate Chinese Entrepreneur s View Leaves Indian Founder Speechless

ఏదో ఒక్కటే మేలంటున్న చైనా

ఆ చైనీస్ వ్యాపారవేత్త మాట్లాడుతూ.. తాము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై ఆన్ లైన్ లో జరిగే చర్చలను నమ్మబోమన్నారు. ఉన్నవి కేవలం రెండు విషయాలు మాత్రమేనని, పని సమయం లేదా వ్యక్తిగత సమయం అని తేల్చేశారు. ఈ సలహా నిష్ఠురంగా ఆచరణాత్మకమైనదిగా మిశ్రాకు అనిపించింది. దీని ప్రకారం భారతీయులు సమతుల్యతను ఊహించుకుంటే, చైనీయులు వేగంగా, స్పష్టంగా పని చేస్తారని ఆయన పేర్కొన్నారు. అంటే ఈ రెండూ ఎప్పటికీ పోల్చుకోలేని విషయాలుగా తేల్చేశారు.

Work-Life Balance Debate Chinese Entrepreneur s View Leaves Indian Founder Speechless

ఆన్ లైన్లో విస్తృత చర్చ

దీనిపై ఆన్ లైన్ లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒక వినియోగదారుడు కొన్నిసార్లు బ్యాలెన్స్ అంటే సమయాన్ని విభజించడం కాదని, ఏ క్షణంలో దేనికి పూర్తి శ్రద్ధ అవసరమో నిర్ణయించుకోవడని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు ఆయనతో విభేధిస్తూ.. అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కు ప్రాధాన్యతనిచ్చినా విజయవంతమయ్యాయని, లేకపోతే అది కేవలం వేతన రహిత శ్రమగా మిగులుతుందని వాదించారు. ఈ చర్చల వేళ భారత్ లోనూ ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి చెప్పిన వారానికి 70 గంటల పని విధానం కూడా తెరపైకి వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+