చికెన్-65లో పురుగులు, బిర్యానీలో ఫంగస్: షాక్ తిన్న కస్టమర్..
బిర్యానీ కూడా కుళ్లిపోయి, ఫంగస్ చేరి ఉండటం గమనించాడు. మేనేజర్ ను నిలదీసినా ఎటువంటి సమాధానం రాలేదు.
మేడ్చల్: ఇటీవలి కాలంలో బిర్యానీపై ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. నగరంలోని చాలా హోటళ్లు నాసిరకం బిర్యానీ వండుతూ కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా బోడప్పల్ లోని స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద కొంతమంది కస్టమర్లు ఆందోళనకు దిగారు. అంతకుముందు ఓ కస్టమర్ చికెన్-65ఆర్డర్ ఇచ్చాడు. అయితే అందులో పురుగులు రావడంతో మరో ఐటెం బిర్యానీని ఆర్డర్ చేశాడు.

బిర్యానీ కూడా కుళ్లిపోయి, ఫంగస్ చేరి ఉండటం గమనించాడు. మేనేజర్ ను నిలదీసినా ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో కస్టమర్లంతా కలిసి స్వాగత్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. సంబంధిత అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications