వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ పరువు తీసేందుకే దాడి: యాసిన్ భత్కల్‌పై ఛార్జిషీట్

|
Google Oneindia TeluguNews

Yasin Bhatkal charged in Jama Masjid blast case
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అక్తర్‌లపై ఢిల్లీ పోలీసులు గురువారం స్థానిక న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేశారు. 2010 సెప్టెంబరులో జామా మసీదు వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడిలో కారు బాంబు పేలుడికి సంబంధించి వీరిపై పోలీసులు ఈ మేరకు ఛార్జిషీటు దాఖలు చేశారు.

ఛార్జిషీటును పరిశీలించిన అదనపు సెషన్స్ జడ్జి దయా ప్రకాష్, తదుపరి విచారణను మే 22కి వాయిదా వేశారు. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌ల ఆదేశాల మేరకు వీరిద్దరూ ప్రెషర్ కుక్కర్ బాంబును ఓ కారులో అమర్చి, జామా మసీదు వద్ద ఉంచారని పోలీసులు తమ ఛార్జిషీటులో పేర్కొన్నారు. కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు భారత పరువు ప్రతిష్టల్ని అంతర్జాతీయ దెబ్బతీసేందుకు ఈ పేలుడుకు పాల్పడినట్లు చెప్పారు.

2010 సెప్టెంబర్ 19న జామా మసీదు 3వ నెంబరు గేటు వద్ద విదేశీ పర్యాటకులు బస్సు నుంచి దిగుతుండగా యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్‌లు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు తైవాన్ పర్యాటకులకు గాయాలయ్యాయి.మొదట కాల్పులతో భయకంపితులను చేసి, చెల్లాచెదురైన వారు పారిపోతుండగా కారు బాంబు పేల్చి మరింత ప్రాణనష్టం జరిగేలా వారు పథకం వేశారు.

అయితే కారులో అమర్చిన బాంబు పేలినా దాని తీవ్రత అంతగా లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. విదేశీ పర్యాటకులే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారని పోలీసులు తమ ఛార్జిషీటులో పేర్కొన్నారు. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేని బలహీన, భద్రత లేని దేశంగా భారత్‌ను చిత్రీకరించాలన్నదే ఉగ్రవాదుల అసలు ఉద్దేశమని పోలీసులు వివరించారు.

English summary
Delhi Police on Thursday filed a chargesheet against Indian Mujahideen co-founder Yasin Bhatkal and his aide Asadullah Akhtar in the September 2010 Jama Masjid attack case, saying they carried out the strike to dissuade foreign nations from participating in the Commonwealth Games.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X