Lady teacher: టీచర్స్ అక్రమ సంబంధం, ఆంటీని చంపేశారు, వెంట్రుకే కదా అనుకుంటే కొంప ముంచింది !

తిరువనంతపురం/ కొచ్చి/ కాసరగూడు: లేడీ టీచర్ ను చంపేసిన సాటి టీచర్, అతని కిలాడీ ఫ్రెండ్ తల వెంట్రుకలతో చిక్కిపోయారు. ఫ్రెండ్ ను కలవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన లేడీ టీచర్ హత్యకు గురి కావడం కేరళలో ఈ ఏడాది జవనరిలో కలకలం రేపింది. లేడీ టీచర్ కు సాటి స్నేహితుడు, డ్రాయింగ్ మాస్టర్ హంతకుడ అని వెలుగు చూడటంతో అరెస్టు చేశారు. స్నేహితుడు అని నమ్మి అతను పిలిచిన వెంటనే వెళ్లిన లేడీ టీచర్ ను కిరాతకంగా హత్య చేశారు. అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీల కారణంగానే లేడీ టీచర్ హత్యకు గురైయ్యింది. హత్యకు గురైన లేడీ టీచర్ తల వెంట్రుకలు హంతకుడిని పట్టించడంతో అతను, అతని ఫ్రెండ్ కటకటాలపాలైనారు. గత ఏడాది జనవరి నెలలో కేరళ లేడీ టీచర్ హత్య కేసుతో సాటి లేడీ టీచర్లు హడలిపోయారు.

 ఫ్రెండ్ కోసం వెళ్లింది.. .అంతే !

ఫ్రెండ్ కోసం వెళ్లింది.. .అంతే !

కేరళలోని కాసరగూడులోని మీయపదవు విద్యావర్ధక హైయ్యర్ సెకండరీ స్కూల్ (కర్ణాటక సరిహద్దులోని ప్రాంతం) లో రూపశ్రీ (44) అనే మహిళ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నారు. 2020 జనవరి 14వ తేదీన స్కూల్ కు సెలవు కావడంతో రూపశ్రీ ఇంటిలో ఉన్నారు. అయితే అదే రోజు సాయంత్రం ఇంటి నుంచి పనిమీద బయటకు వెళ్లింది. తరువాత ఫ్రెండ్ ను కలవడానికి వెళ్లిన రూపశ్రీ తరువాత ఇంటికి మాత్రం తిరిగి రాలేదు.

సంక్రాంతి రోజు షాక్

సంక్రాంతి రోజు షాక్

జనవరి 16వ తేదీన కేరళలోని పెరవాడు సమీపంలోని లోయలో లేడీ టీచర్ రూపశ్రీ శవమై కనిపించింది. రూపశ్రీ అనుమానాస్పద స్థితిలో మరణించిందని మంజేశ్వర పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రూపశ్రీ హత్యకు గురైయ్యిందని, తెలిసిన వారే ఆమెను హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.

 టీచర్ల లవ్ స్టోరీ

టీచర్ల లవ్ స్టోరీ

డ్రాయింగ్ టీచర్ ఫ్రెండ్ రూపశ్రీ పని చేస్తున్న స్కూల్ లో వెంకటరమణ కారంత (48) డ్రాయింగ్ టీచర్ గా పని చేస్తున్నాడు. రూపశ్రీ, డ్రాయింగ్ టీచర్ వెంకటరమణ మంచి ఫ్రెండ్స్. తరువాత రూపశ్రీ, వెంకటరమణల మద్య అక్రమ సంబంధానికి దారితీసింది. అంతే కాకుండా రూపశ్రీ, వెంకటరమణల మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అయితే కొంత కాలం నుంచి ఇద్దరి మధ్య స్నేహం, ఆర్థిక లావాదేవీల విషయంలో మనస్పర్థలు వచ్చాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 రూపశ్రీ ఆంటీని లేపేశాడు

రూపశ్రీ ఆంటీని లేపేశాడు

రూపశ్రీ హత్య జనవరి 14వ తేదీన సెలవు కావడంతో రూపశ్రీ, వెంకటరమణ ఇద్దరూ స్కూల్ కు వెళ్లలేదు. అదే రోజు సాయంత్రం నీతో మాట్లాడాలని, నీ డబ్బు తిరిగి ఇచ్చేస్తానని రూపశ్రీని వెంకటరమణ తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన వెంకటరమణ పక్కాప్లాన్ తో రూపశ్రీని నీళ్ల బకెట్ లో ఆమె తల ముంచి ఊపిరి ఆడకుండా చేసి దారుణంగా హత్య చంపేశాడు.

 కిలాడీ ఫ్రెండ్ కారు

కిలాడీ ఫ్రెండ్ కారు

లేడీ టీచర్ రూపశ్రీని హత్య చేసిన వెంకటరమణ తరువాత కిలాడీ ఫ్రెండ్ నిరంజన్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తరువాత రూపశ్రీ శవాన్ని నిరంజన్ కారులో తీసుకెళ్లి పెరవాడు సమీపంలోని లోయలో విసిరివేసి పరారైనారు. ఏం కాదులేరా, నేను ఉన్నాను, ఇక మరిచిపో, శవం కూడా చిక్కదు అంటూ నిరంజన్ కిల్లర్ వెంకటరమణకు ధైర్యం చెప్పాడు. రూపశ్రీ శవం స్వాధీనం చేసుకున్న తరువాత మొదటి నుంచి వెంకటరమణ మీద అనుమానం ఉన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ట్రీట్ మెంట్ ఇచ్చారు.

 జస్ట్ వెంట్రుకలతో చిక్కిపోయారు

జస్ట్ వెంట్రుకలతో చిక్కిపోయారు

రూపశ్రీ హత్య కేసు విచారణ చేసిన పోలీసులు వెంకటరమణను అదుపులోకి తీసుని విచారణ చెయ్యగా ఎలాంటి ఫలితం లేకపోయింది. తాను రూపశ్రీని హత్య చెయ్యలేదని వెంకటరమణ పదేపదే చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే వెంకటరమణ స్నేహితుడు నిరంజన్ కారును పరిశీలించిన పోలీసులకు ఆ కారు డిక్కీలో మహిళ తల వెంట్రుకలు చిక్కాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ కు తల వెంట్రుకలు పంపించగా అవి రూపశ్రీవి అని వెలుగు చూసింది. రూపశ్రీని హత్య చేసిన వెంకటరమణను, శవాన్ని మాయం చెయ్యడానికి సహకరించిన కిలాడి ఫ్రెండ్ నిరంజన్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+