నోరు మూసుకో..నీకే మంచిది కాదు : బాబా రాందేవ్ బెదిరింపు : వైరల్ అవుతున్న వ్యాఖ్యలు..!!
యోగా గురు రాందేవ్ సహనం కోల్పోయారు. ప్రశ్నలు అడిగిన జర్నలిస్టు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక విధంగా బెదిరింపులకు దిగారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు పైన ప్రశ్నతో ఆయనకు ఆగ్రహం వచ్చింది. ఏకంగా నోరు మూసుకో.. మంచిది కాదు.. మీ తల్లితండ్రులకు మంచి కొడుకుగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో దీని పైన నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. హర్యానాలోని కర్నాల్ లో రాందేవ్ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో 2014 ఎన్నికల సమయంలో బాబా రాందేవ్ దేశంలోని ప్రజలకు ఒక అప్పీల్ చేసారు.
లీటరు పెట్రోలు రూ 40, గ్యాస్ సిలిండర్ రూ 300 కే ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. దీంతో..ఇప్పుడు ఇదే అంశం పైన ఒక విలేకరి బాబా రాందేవ్ ను ప్రశ్నించారు. దీంతో..ఒక్క సారిగా రాందేవ్ సహనం కోల్పోయిన తన నోటికి పని చెప్పారు. ప్రస్తుతం ఆయిల్ ధరలు పెరగటం పైన ప్రశ్న వేయటంతో..ఆగ్రహంతో రాందేవ్ స్పందించారు. ఇలాంటి ప్రశ్నలు వేయద్దంటూ సూచించారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన పని లేదంటూ ఫైర్ అయ్యారు. దీని పైనే మరోసారి అదే విలేకరి ప్రశ్నించే ప్రయత్నం చేసారు.

దీంతో..ఆగ్రహంతో రాందేవ్..అవును..అప్పుడు నేను అలానే చెప్పారు.. నువ్వేం చేస్తావు.. నోరు మూసుకో.. మళ్లీ ఇటువంటి ప్రశ్నలు అడగవద్దు.. మంచిది కాదు..నువ్వు నీ తల్లిదండ్రులకు మంచి కొడుకుగా ఉండాలి అంటూ హెచ్చరించారు. ఆ తరువాత ఇంధన ధరల పెంపు పైనా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇంధన ధరలు తగ్గితే పన్ను రాదని చెప్పారు. దేశాన్ని ఎలా నడుపుతారని.. జీతాలు చెల్లిస్తారని.. రోడ్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. కష్ట సమయాల్లో మరింత కష్టపడి పనిచేయాలని రామ్‌దేవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను కూడా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే, రాందేవ్ సీరియస్ అయిన వ్యవహారం ఇప్పుడు వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications