సనాతన ధర్మం ఒక్కటే మతం, మిగతావన్నీ...యోగీ ఆదిత్యనాథ్ మరో సంచలనం..
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారడం లేదు. ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్న బీజేపీ నేతలు ఇప్పటికే కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే సనాతన ధర్మానికి మద్దతుగా పలు వ్యాఖ్యలు చేస్తున్న యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తాజాగా మరోసారి దీనికి మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఈసారి డోస్ పెంచారు కూడా.
తాజాగా సనాతన ధర్మంపై స్పందిస్తూ యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో సనాతన ధర్మం ఒక్కటే మతమని, మిగతావన్నీ వర్గాలు, పూజా విధానాలేనని సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని గోరఖ్ పూర్ లో నిర్వహించిన 'శ్రీమద్ భగవత్ కథా జ్ఞాన యాగం' కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, "సనాతన ధర్మం ఒక్కటే మతం, మిగిలినవి అన్ని శాఖలు, పూజా విధానాలు మాత్రమేనన్నారు. సనాతన ధర్మం మానవత్వమని, దానిపై దాడి చేస్తే అప్పుడు ప్రపంచవ్యాప్తంగా మానవాళికి సంక్షోభం తప్పదన్నారు.

గోరఖ్‌నాథ్ ఆలయంలో జరిగిన ఏడు రోజుల 'శ్రీమద్ భగవత్ కథా జ్ఞాన యాగం' ముగింపు సందర్భంగా జరిగిన చివరి సెషన్‌లో ముఖ్యమంత్రి యోగి ప్రసంగించారు. శ్రీమద్ భగవత్ సంకుచిత దృక్కోణాల సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి,దాని విశాలతను అర్థం చేసుకోవడానికి పోరాడటానికి ఓపెన్ మైండ్‌సెట్ కలిగి ఉండటం ముఖ్యమని యోగీ తెలిపారు. అలాగే సనాతన ధర్మం విషయంలోనూ యోగీ తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సనాతన ధర్మం వివాదాన్ని హైలెట్ చేస్తూ విపక్షాల్ని ఇరుకునపెట్టేందుకు ఎన్డీయే సర్కార్, బీజేపీ సిద్దమవుతున్న నేపథ్యంలో యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications