అమెరికాలో వేడుకల్లో కాల్పులు, ఒకరి మృతి: ప్రియురాలితో బ్రేకప్ వల్లే..

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా శాన్ డియాగోలో నల్లజాతీయులపై కాల్పులు జరిగాయి. ఇవి జాతి విద్వేష కాల్పులుగా చెబుతున్నారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

స్నేహితుడు ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న నల్ల జాతీయులపై కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు మట్టుబెట్టారు. నిందితుడిని పీటర్‌ సెలీస్‌గా గుర్తించారు. పీటర్‌ సెలీస్‌(47) కూడా అదే ఆ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు.

San Diego shooting

బీరు తాగుతూ తన వద్ద దాచుకున్న తుపాకీని తీసి ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించాడు. దీంతో అక్కడివారు తమని తాము రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఇది కచ్చితంగా జాతివిద్వేష చర్యే అంటున్నారు. నిందితుడిపై గతంలో పలు కేసులు ఉన్నాయి.

ఇటీవల బ్రేకప్ కారణంగా నిరాశతో..

మరోవైపు, బ్రేకప్ కారణంగా నిరాశలో ఈ పని చేశాడని కూడా అంటున్నారు. నిందితుడికి ఇటీవలే ప్రియురాలితో బ్రేకప్ అయింది. దీంతో అతను తీవ్ర నిరాశలో ఉన్నాడని చెబుతున్నారు. జాతి విద్వేష కాల్పులు కావని, బ్రేకప్ కారణంగా నిరాశలో ఈ పని చేశాడని కూడా అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The man accused of opening fire at a birthday pool party at a San Diego apartment complex, killing one and injuring seven, was purportedly despondent over a recent breakup with his girlfriend, police said today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి