Not Good- ఆందోళనలో డొనాల్డ్ ట్రంప్: 19 మృతదేహాలు రికవరీ- ఇంకా పెరగొచ్చు
Donald Trump: అమెరికాలో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. రాజధాని వాషింగ్టన్ డీసీలో గల రొనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంపై ఈ దుర్ఘటన సంభవించింది. దీనిపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
64 మంది ప్రయాణికులతో కూడిన ఫ్లైట్.. అమెరికా సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను గాల్లోనే ఢీ కొట్టింది. రొనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి స్పష్టమైన సంకేతాలు అందడంతో ల్యాండ్ అవుతోన్న హెలికాప్టర్‌ను ఢీ కొట్టిందీ పాసింజర్ ఫ్లైట్.

ఢీ కొట్టిన వెంటనే రెండూ గాల్లోనే ముక్కలయ్యాయి. పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయాయి. కుప్పకూలిపోయాయి. విమానం, హెలికాప్టర్ శకలాలు ఎక్కడికక్కడ ఎగిరిపడ్డాయి. పొటొమాక్ రివర్‌లో చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి.
ఇప్పటివరకు 19 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ప్రమాద సమయంలో 64 మంది ప్రయాణికులు ఫ్లైట్‌లో ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. వాళ్ల పరిస్థితేమిటనేది ఇంకా తెలియరావట్లేదు.
ఈ ఘటన పట్ల ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. అన్నీ సవ్యంగానే ఉన్నప్పటికీ- ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. హెలికాప్టర్ దిశ తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనీ తేల్చి చెప్పారు.
ఫ్లైట్ సరైన దిశలోనే ప్రయాణించిందని, ఎయిర్‌పోర్ట్ ల్యాండ్ కావడానికి సిద్ధపడుతున్న సమయంలో చాపర్ దీన్ని ఢీ కొట్టిందని వివరించారు. హెలికాప్టర్ తన దిశను మార్చుకున్నట్లు స్పష్టంగా కనిపించిందని, దారి తప్పడం వల్ల నేరుగా విమానాన్ని ఢీ కొట్టిందని పేర్కొన్నారు.
Video appears to show Two Aircraft, a Helicopter and Commercial Airliner, colliding earlier at Ronald Reagan Washington National Airport near D.C pic.twitter.com/ZJo0wyGbpp
— OSINTdefender (@sentdefender) January 30, 2025
ఆకాశంలో మేఘాలు అడ్డుగా లేవని, ఫ్లైట్ లైట్లు వెలుగుతున్నప్పటికీ.. హెలికాప్టర్ నేరుగా దాన్ని ఢీ కొట్టడం సందేహాలను రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. పాసింజర్ ఫ్లైట్ ఉందనే విషయాన్ని కంట్రోల్ టవర్ ఎందుకు ముందుగా చాపర్ సిబ్బందిని అప్రమత్తం చేయలేదనే ప్రశ్నను లేవనెత్తారు. ఇది అత్యంత దురదృష్టకరమని, ఇది పూర్తిగా మానవ తప్పిదమేనని అన్నారు. నాట్ గుడ్ అంటూ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications