తాలిబన్లను గుర్తించకపోతే 9/11 రిపీట్-పాకిస్తాన్ భద్రతా సలహాదారు షాకింగ్-విమర్శలతో యూటర్న్

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్దానంలో పగ్గాలు చేపట్టిన తాలిబన్లను గుర్తించేందుకు అంతర్జాతీయంగా పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు చేసిన వ్యాఖ్యలు పాశ్చాత్య దేశాలకు మంటపుట్టించాయి. దీంతో అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు చెలగేగాయి. చివరికి ఆయన తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు.

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలనను గుర్తించకపోతే పాశ్చాత్యదేశాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్ తాజాగా ఓ రష్యన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలపై 9/11 తరహా దాడులు రిపీట్ అయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే పాశ్చాత్య దేశాలు వ్యతిరేకిస్తున్న తాలిబన్లకు బహిరంగంగానే పాకిస్తాన్ మద్దతిస్తుున్న నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు చేసిన వ్యాఖ్యలు వారికి ఎక్కడో గుచ్చుకున్నాయి.

9/11 attack will repeat if western countries not recognise talibans : pakistan nsa shocking comments

ఈ ఇంటర్వ్యూ వివాదాస్పదం కావడంతో సండే టైమ్స్ పై పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్ విరుచుకుపడ్డారు. వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకున్నారంటూ, తమ ఇంటర్వ్యూలోని అంశాల్ని వివాదాస్పదం చేశారంటూ విమర్శలకు దిగారు. దీంతో తమ వద్ద ఆయన చేసిన వ్యాఖ్యల రికార్డు కూడా ఉందని సండే టైమ్స్ ప్రకటించింది. దీంతో ఆయన వ్యాఖ్యలు నిజమేనని తేలిపోయింది. ఇది సహజంగానే పాశ్చాత్య దేశాలకూ, పాకిస్తాన్ కూ మధ్య కూడా దూరాన్ని పెంచుతోంది. మొయీద్ యూసుఫ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ లోని ఇమ్రాన్ సర్కార్ వివరణ ఇవ్వాలనే డిమాండ్లు పాశ్చాత్య దేశాల నుంచి వినిపిస్తున్నాయి.

అసలే తాలిబన్లకు మద్దతిస్తూ అగ్రరాజ్యాలకు దూరమవుతున్న పాకిస్తాన్ కు తమ భద్రతా సలహాదారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని సమర్ధించుకోవడం కష్టంగా మారింది. అయితే తీవ్రవాదాన్ని భారత్ పైకి ఎగదోస్తుందన్న ఆరోపణల్ని ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఇప్పుడు తాలిబన్లకు మద్దతు ద్వారా దాన్ని నిజం చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇదీ పాకిస్తాన్ కు ఇబ్బందికరంగానే మారుతోంది. భవిష్యత్తులో అగ్రరాజ్యాల నుంచి పాకిస్తాన్ కు అందే సాయంపై ఈ తాజా పరిణామాలు కచ్చితంగా ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+