Viral Video: సింహంతో అట్లుంటది మరి.. ఇడ్చిపడేసిన సింహరాజు..
సింహాలు అత్యంత క్రూరమైన జంతువులని తెలిసిన తెలిసిందే. వీటి బారిన పడితే బతికి బట్టకట్టడం చాలాచాలా తక్కువనే చెప్పాలి. సింహం నుంచి తప్పించుకోవడానికి 25 శాతం మాత్రమే అవకాశం ఉందని చెబుతారు. ఈ మాంసాహారులు కనికరం లేనివిగా పేరుగాంచాయి కూడా.. కానీ ఓ వ్యక్తి సింహం దాడిలో గాయపడి చావు అంచువరకు వెళ్లొచ్చాడు. 2018లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ భయంకరమైన ఘటనలో సింహం దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దక్షిణాఫ్రికా తబాజింబిలోని మకరేలే ప్రిడేటర్ సెంటర్‌కు బ్రిటిష్ యజమాని అయిన 67 ఏళ్ల హాడ్జ్ సింహల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. కాస్తా లోపలికి కూడా వెళ్లాడు. అతన్ని చూసిన ఓ సింహం దగ్గరు వస్తుండగా.. అతని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ సింహం అతన్నిఇడ్చి పడేసింది. దీంతో అతను కింద పడిపోయి చలనం లేకుండా ఉన్నాడు. అయినా సింహం వదలలేదు. దాడి చేసింది.

హాడ్జ్ మెడ, దవడను తీవ్రంగా గాయపరిచింది. ఈ క్రమంలో అక్కడున్న వారు కేకలు వేస్తున్నారు. మరికొదంరు ఈ దృశ్యాలను కెమెరాలో బంధిస్తున్నారు. సింహం దూరంగా వెళ్లిపోయిన తర్వాత అతన్ని ఆస్పత్రికి తరలించారు. హాడ్జ్ గాయపడినప్పటికీ చిరునవ్వుతో ఉన్నట్లు వీడియోలో కనిపించింది. అతను ఆస్పత్రి నుంచి కోలుకుని బయటకు వచ్చాడు. సింహాలలో ఒకదానిని పరిశీలించడానికి హాడ్జ్ ఎన్‌క్లోజర్ లోపలికి వెళ్లినట్లు తెలిసింది.
Terrifying moment lion savagely attacks British park owner pic.twitter.com/s3sPHjAwyx
— Terrifying Nature (@TerrifyingNatur) April 28, 2023
అప్పటి వీడియోను టెర్రిఫైయింగ్ నెచర్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పోస్ట్ తోపాటు "భయంకరమైన క్షణం సింహం బ్రిటిష్ పార్క్ యజమానిపై క్రూరంగా దాడి చేసింది" అని రాశారు. ఈ వీడియోకు 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. వెయ్యికి పైగా రీట్వీట్లు వచ్చాయి.












Click it and Unblock the Notifications