వీధుల్లో వేధింపులపై షార్ట్ ఫిలిం: నటికి 'రేప్' బెదిరింపు
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలోని వీధుల్లో మహిళల పైన జరుగుతున్న వేధింపులను తెలిపేందుకు ఓ షార్ట్ ఫిలిం తీశారు. ఈ చిత్రీకరణలో పాల్గొన్న యువతికి అత్యాచార బెదిరింపులు వస్తున్నాయి. హోలాబ్యాక్ అనే సంస్థ నగరంలో స్త్రీల పైన జరిగే వేధింపులను లైవ్‌గా పిక్చరైజ్ చేసింది.
10 అవర్స్ వాకింగ్ ఇన్ ఎన్‌వైసీ యాజ్ ఏ ఉమన్ పేరిట ఆ షార్ట్ ఫిలిం వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. మంగళవారం ఈ వీడియో అప్ లోడ్ అయింది. దీనికి పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో షొషానా బి రాబర్ట్స్ అనే యువతి ప్రధాన పాత్రధారి.
షొషానా న్యూయార్క్ వీధుల గుండా నడుస్తుండగా.. ఆమె ముందు ఓ వ్యక్తి బ్యాక్ ప్యాక్ తగిలించుకుని వెళుతుంటాడు. ఆ బ్యాక్ ప్యాక్‌కు ఉన్న కెమెరా ద్వారా ఆమెకు ఎదురైన అనుభవాలను చిత్రీకరించారు. బ్యాక్ ప్యాక్ ధరించిన వ్యక్తి పేరు రాబ్ బ్లిస్. ఈ వీడియో ఐడియా అతడిదే.

తన గర్ల్ ఫ్రెండ్‌కు ఎదురైన వేధింపుల పట్ల స్పందించిన రాబ్ బ్లిస్ ఈ వీడియో ద్వారా సమస్య తీవ్రతను వెల్లడించాలని నిర్ణయించుకున్నాడు. షార్ట్ ఫిలిం విషయానికొస్తే, షొషానా బిగ్ యాపిల్ స్ట్రీట్ గుండా వెళుతుండగా కారు కూతలు వినిపించాయి. నైస్, డామ్, స్వీటీ... ఇలా రకరకాలుగా పలువురు ఆమెను పలకరించే ప్రయత్నాలు చేశారు.
నా నెంబర్ ఇస్తే మాట్లాడతావా? అంటూ ఒకరు, నువ్వు అందంగా ఉన్నావని అభినందిస్తున్నామని ఇంకొకరు ఆమె వెంటపడ్డారట. ఈ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత అందులో నటించిన షొషానాను రేప్ చేస్తామంటూ సందేశాలు వచ్చాయని హోలాబ్యాక్ ట్విట్టర్లో పేర్కొంది.
బెదిరింపులపై హోలాబ్యాక్ డైరెక్టర్ ఎమిలీ మాట్లాడుతూ... తమ వీడియో బాగానే ప్రభావం చూపిస్తోందన్న విషయాన్ని ఈ బెదిరింపులే స్పష్టం చేస్తున్నాయని, అయినప్పటికీ, ఈ సమస్యపై మరింతగా పోరాడాలని భావిస్తున్నామన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications