
వామ్మో.. నడిరోడ్డుపై, కారులో వెళ్తుండగా.. కూలిన విమానం, మంటలు.. ఇద్దరు మహిళలు
అప్పుడప్పుడు వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. అనుకొకుండా జరిగే ఘటనలతో విచిత్రంగా అనిపిస్తాయి. అచ్చం ఇలాంటి ఘటన అమెరికాలో జరిగింది. ఓ విమానం కారుపై కుప్పకూలింది. వినడానికి వింతగా.. చదవడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదీ నిజం. ఆ ప్రమాదంలో ప్రాణ నష్టం కూడా జరగడం విషాదకరం. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. పదండి.

విచిత్ర ప్రమాదం
రోడ్డు ప్రమాదం అంటే రెండు కార్ల మధ్య జరుగుతోంది. లేదంటే రెండు వాహనాల మధ్య జరిగిందని వింటాం. కానీ ఫ్లోరిడాలో కారుపై ఏకంగా విమానం కూలింది. కారులో వెళ్తుండగా.. ప్లైట్ వారిపై వచ్చిపడింది. వెంటనే మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.

టెక్నికల్ ప్రాబ్లమ్
దక్షిణ ఫ్లోరిడాలోని నార్త్ పెర్రీ విమానాశ్రయం నుంచి ఓకే ఇంజిన్ ఉండే ఓ చిన్న విమానం టేకాఫ్ అయ్యింది. సాంకేతికత సమస్య తలెత్తడంతో ఒక్కసారిగా రోడ్డుపై వెళ్తున్న కారుపై కుప్పకూలింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారిని దహించి వేశాయి. ఆ కారులో ఉన్నది ఇద్దరు మహిళలే కావడం విశేషం.

ఇద్దరు మృతి
ఆ మహిళలను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు ధ్రువీకరించారు. అనూహ్య ఘటన చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

రహదారిపై.. కారులో కూడా భద్రత లేదా..?
తమ పని కోసం మహిళలు కారులో వెళ్తుంటే వారి వాహనంపై విమానం పడటం ఆశ్చర్య కలిగిస్తోంది. వెంటనే మంటలు చెలరేగడంలొ కారులో ఉన్నవారు అలానే ఉండిపోయారు. వీరి ప్రమాదం కాస్త విచిత్రంగా జరిగింది. ఆ వీడియో కూడా చూస్తుంటే కాస్త జాలి కలుగుతోంది. ఇదేంది రహదారిపై కారు నడపితే కూడా ప్రమాదం జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.