వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ఘన్ లో మళ్లీ అంతర్యుద్ధం-తిరుగుబాటుదారుల సమాంతర సర్కార్-పాశ్చాత్య మద్దతుతో

|
Google Oneindia TeluguNews

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకు పాకిస్తాన్, చైనా, రష్యా వంటి దేశాల మధ్తతు కూడా తీసుకుంటున్నారు. పంజ్ షీర్ లో ప్రతిఘటన దళాల్ని మట్టుబెట్టాక తాలిబన్లు ఈ మేరకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే తాజా పరిణామాలతో ఆప్ఘన్ లో తమ పాత్ర నామమాత్రంగా మారిపోవడం ఇష్టం లేని పాశ్చాత్య దేశాలు ప్రతిఘటన దళాలను మళ్లీ ఎగదోస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో యూఎస్, బ్రిటన్ వంటి దేశాల సాయంతో ఆప్ఘన్ లో సమాంతర ప్రభుత్వ ఏర్పాటుకు వారు సిద్ధమవుతున్నారు.

SamanthaAkkineni: స్మైలీ బ్యూటీ సామ్ ఇంట హాట్ గా ఎపుడు చూసి ఉండరు (ఫొటోస్)

ఆప్ఘన్ లో రోజుకో ట్విస్ట్

ఆప్ఘన్ లో రోజుకో ట్విస్ట్

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బలు తప్పేలా లేవు. ఇప్పటికే అక్కడ ప్రభుత్వం ఏర్పాటుపై సొంత పర్గంలోనే అసంతృప్తులు వ్యక్తమవుతుండగా.. ఇప్పుడు పంజ్ షీర్ లో తాము దెబ్బకొట్టిన ప్రతిఘటన దళాలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. వీరికి పాశ్చాత్య దేశాల మద్దతు కూడా లభిస్తుండటంతో ఆప్ఘన్ లో ఏదైనా జరగొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో మళ్లీ అంతర్యుద్ధం మొదలుకావచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

పంజ్ షీర్ నుంచి కోలుకున్న రెసిస్టెంట్ ఫ్రంట్

పంజ్ షీర్ నుంచి కోలుకున్న రెసిస్టెంట్ ఫ్రంట్

పంజ్ షీర్ లో తాలిబన్లను భీకరంగా ఎదిరించి చివర్లో తలొగ్గిన ప్రతిఘటన దళాలు ఇప్పుడు దాన్నుంచి కోలుకుని మరో పోరుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ దేశాల సహకారంతో ఇన్నాళ్లూ తాలిబన్లనను ఎదిరించిన ప్రతిఘటన దళాలు మరోసారి అదే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తాలిబన్లపై మరో పోరుకు వారు వ్యూహరచన చేస్తున్నారు. తాజా పరిణామాలతో పంజ్ షీర్ లో వీరిని అణగదొక్కామన్న సంతోషం తాలిబన్లకు ఎక్కువకాలం మిగిలేలా కనిపించడం లేదు. దీంతో మారిన పరిస్ధితుల్లో ఆప్ఘనిస్తాన్ కు మరో అంతర్యుద్ధం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

 సమాంతర ప్రభుత్వ ఏర్పాటు

సమాంతర ప్రభుత్వ ఏర్పాటు

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న తరుణంలో దీనికి కౌంటర్ గా తాము మరో సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రతిఘటన దళాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై వారి నుంచి ఓ ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల మధ్దతుతో ఏర్పడే ఈ ప్రభుత్వం తాజాగా మాజీ అయిన అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని పోలి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు సరే ఆప్ఘన్ పై వీరికి పట్టు చిక్కుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం ఎలా ఉంటుందంటే ?

ప్రభుత్వం ఎలా ఉంటుందంటే ?

తాలిబన్లకు వ్యతిరేకంగా తాము ఏర్పాటు చేసే కొత్త ప్రభుత్వం ఎలా ఉండబోతోందో కూడా రెసిస్టెంట్ ఫ్రంట్ నేత అహ్మద్ మసౌద్ తేల్చిచెప్పేశారు. కచ్చితంగా తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల మద్దతుతో పాలన కొనసాగిస్తుందని కూడా ఆయన వెల్లడించారు. తాలిబన్ల ప్రభుత్వం అక్రమమని, ప్రజలపై వారికి ఉన్న కక్షకు ఈ ప్రభుత్వం నిదర్శమని ప్రతిఘటన దళాల నేత అయిన అహ్మద్ మసౌద్ తెలిపారు. ఆప్ఘనిస్తాన్ భద్రతకు, స్ధిరత్వానికి, ప్రజలకూ తాలిబన్ల ప్రభుత్వం ప్రమాదరకరమని, ఆయన పేర్కొన్నారు.

భారత్ సహా పాశ్చాత్య దేశాల మద్దతు ?

భారత్ సహా పాశ్చాత్య దేశాల మద్దతు ?

ఆప్ఘనిస్తాన్ లో ప్రతిఘటన దళాలు తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దానికి మద్దతిచ్చేందుకు భారత్ సహా పలు పాశ్చాత్య దేశాలు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ విదేశీ ప్రభుత్వ నేతలతో రాజకీయ చర్చలు జరిపాక ఈ సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు రెసిస్టెన్స్ ఫ్రంట్ నేత అహ్మద్ మసౌద్ వెల్లడించారు. తద్వారా తమ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని, అయితే ఇందుకు వివిధ దేశాల సహకారం తీసుకోబోతున్నట్లు ఆయన చెప్పకనే చెప్పినట్లయింది.

మరో అంత్యర్యుద్ధం తప్పదా ?

మరో అంత్యర్యుద్ధం తప్పదా ?

ఆప్ఘన్ లో తాలిబన్లు ఏర్పాటు చేస్తున్న కొత్త ప్రభుత్వానికి సమాతరంగా ప్రతిఘటన దళాలు మరో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇన్నాళ్లూ అక్కడ సాగుతున్న అంతర్యుద్ధానికి మరో కొనసాగింపులా పరిస్ధితులు మారడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో గతంలో ప్రజా ప్రభుత్వానికి మద్దతు పలికిన పాశ్చాత్య దేశాల్లో ఎన్ని కలిసివస్తాయన్నది కూడా అనుమానమే. దీంతో తాలిబన్ల ప్రభుత్వానికీ, ప్రతిఘటన దళాలకూ మధ్య మరో పోరు తప్పేలా లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో పాకిస్తాన్ మొన్న పంజ్ షీర్ లో జోక్యం చేసుకుని తాలిబన్లకు సాయం చేసినట్లుగా మరో ప్రయత్నం చేస్తుందా అన్న చర్చ నడుస్తోంది.

English summary
resistance front have plan to form parallel government in afghanistan amid recent developments in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X