అమెరికాలో భారీ భూకంపం: 7.8 తీవ్రత.. అలస్కా తీరంలో సునామీ హెచ్చరికలు జారీ.. హైటెన్షన్..
అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. అలస్కా దక్షిణ తీరంలోని చిగ్నిక్ సిటీకి 98 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సముద్ర అడుగున 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించడంతో సునామీ తలెత్తనుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.12 కు భూకంపం సంభవించగా, మరో గంటన్నరలో సునామీ తీరాన్ని తాకనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అమెరికా జియాలజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) కీలక ప్రకటన విడుదల చేసింది. అలస్కా తీరం నుంచి 300 కిలోమీటర్ల మేర సునామీ ప్రభావం ఉంటుందని ప్రజల్ని అప్రమత్తం చేశారు.
నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ వివరణ ప్రకారం భూకంపం తరువాత సంభవించబోయే సునామీ దక్షిణ అలస్కాను ప్రభావితం చేస్తుందని, పసిఫిక్ తీరంలోని కెన్నడీ ఎంట్రెన్స్ నుంచి హోమర్‌కు నైరుతి దిశలో 40 మైళ్ళ వరకు ఎఫెక్ట్ ఉండనుంది. భూకంప తీవ్రత 7.6 నుంచి 7.8 మధ్యలో ఉంటే అవి విధ్వసక సునామీలను సృష్టిస్తాయని యుఎస్‌జీఎస్ పేర్కొంది. మరిన్ని భూకంపాలు రావొచ్చని ఆ సంస్థ హెచ్చరించిన కొద్ది సేపటికే..
Recommended Video

అదే అలస్కా తీరంలో శాండ్ పాయింట్ తీరం నుంచి 103 కిలోమీటర్ల దూరంలో మరో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ సముద్రంలో 17.7 కిలోమీటర్ల లోతులో తలెత్తిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. సముద్రం అడుగులో భూకంపం వల్ల తీర పట్టణాల్లో ఎలాంటి ప్రభావం పడలేదని యూఎస్ జీఎస్ తెలిపింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications