"షేక్ హసీనా ఎప్పటికీ నేరస్థురాలే..! మాకు అప్పగిస్తే..భారత్ కు బంగ్లా హామీ..!
బంగ్లాదేశ్ లో (bangladesh) గతేడాది విద్యార్దుల తిరుగుబాటు తర్వాత పదవీచ్యుతురాలై భారత్ కి వచ్చి ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాపై (sheikh hasina) ఆమె స్వదేశంలో ఆగ్రహం ఇంకా అలాగే ఉంది. ఆమె చేసిన నేరాలకు దోషిగా నిర్దారింంచిన అక్కడి న్యాయస్ధానాలు శిక్ష విధించేందుకు వీలుగా హసీనాను తమకు అప్పగించాలని భారత్ ను కోరినా, నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉన్నా కేంద్రం ఒప్పుకోలేదు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లిపోయేందుకు సిద్దంగా ఉన్నట్లు ఈ మధ్యే ప్రకటించిన హసీనాపై అక్కడి ప్రభుత్వం మరోసారి స్పందించింది.
బంగ్లాదేశ్ లో చేసిన నేరాలకు గాను షేక్ హసీనాను ఇప్పటికే అక్కడి కోర్టుకు దోషిగా నిర్దారించాయి. ఆమె తిరిగి వెళ్తే అక్కడ మరణ శిక్ష విధించడం కూడా ఖాయం. అయినా హసీనాలో ఇంకా ఆశలు బతికే ఉన్నాయి. దీంతో ఆమె డిసెంబర్ లో స్వదేశం వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ న్యాయశాఖమంత్రి మొహమ్మద్ అసదుజ్జమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హసీనా దోషిగా నిర్ధారణ అయిన నేరస్థురాలని, ఆమెను తక్షణం తమకు అప్పగించాలని భారత్ ను మరోసారి కోరారు.

హసీనాను స్వదేశానికి రప్పించేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయశాఖ మంత్రి తెలిపారు. ఆమె స్వదేశానికి తిరిగ వస్తే చట్ట ప్రకారమే ఆమెను శిక్షిస్తామని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో న్యాయ మంత్రిత్వ శాఖకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ, ఇది భారతదేశంతో కుదుర్చుకున్న అప్పగింత ఒప్పందానికి సంబంధించిన అంశం కావడంతో, హోం మంత్రిత్వ శాఖ దీనిపై దృష్టి సారించిందని ఆయన తెలిపారు. ఈ వ్యవహారాన్ని భావోద్వేగాలకు తావులేకుండా, చట్టప్రకారం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం, నిర్ణీత చట్టపరమైన ప్రక్రియ ద్వారా ఆమెను తిరిగి పంపాలని తాము కోరామన్నారు. తద్వారా భారత్ తమకు షేక్ హసీనాను అప్పగించినా చట్టాన్ని మీరి తాము ఆమెను శిక్షించేది లేదని న్యాయశాఖ మంత్రి తేల్చిచెప్పారు.














Click it and Unblock the Notifications
