బంగ్లా సర్కార్ తో సీక్రెట్ డీల్, భారత్ పాత్ర ? తేల్చేసిన హసీనా..!
రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో విద్యార్దుల తిరుగుబాటు తలెత్తడం, దాన్ని అణచివేసేందుకు విఫలయత్నం చేసి పదవీచ్యుతురాలై భారత్ కు శరణార్ధిగా పారిపోయి వచ్చేసిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు (Sheikh Hasina) ఇప్పుడు ఎటుచూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. ఓవైపు భారత్ కు వచ్చి రెండేళ్లవుతున్నా ఇక్కడ నుంచి తన స్వరం వినిపించే పరిస్దితి కనిపించడం లేదు, అలాగే స్వదేశంలో తన కోసం ఎదురుచూస్తూ నిషేధం నీడలో మగ్గుతున్న సొంత పార్టీ అవామీ లీగ్ ను కాపాడుకోవాల్సిన పరిస్దితి ఆమెది. దీంతో తనపై బంగ్లాదేశ్ లో మోపిన నేరాలకు ఉరిశిక్ష ఎదురైనా సరే తిరిగి వెళ్లిపోతానని ఆమె చెబుతూ వస్తున్నారు.
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. గతంలో షేక్ హసీనా భారత్ కు పారిపోయి వచ్చి తలదాచుకున్న తర్వాత.. ఆమెను తిరిగి తమకు అప్పగించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం పదే పదే కోరింది. అయినా భారత్ కానీ, హసీనా కానీ స్పందించలేదు. ఆ తర్వాత ఎన్నికలు జరిగి తారిఖ్ రెహ్మన్ నేతృత్వంలో రెగ్యులర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇదే విజ్టప్తి చేస్తున్నా వీరిద్దరూ స్పందించడం లేదు. తాజాగా భారత్ రావాలనుకున్న అక్కడి ప్రధాని తారిఖ్ రెహ్మన్.. చివర్లో హసీనాను అప్పగిస్తేనే అని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి భారత్ తిరస్కరించడంతో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు.

అయినా కొంతకాలంగా డిసెంబర్ లో బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లిపోతానంటూ హసీనా పదే పదే చెప్తున్నారు. అక్కడికి వెళ్లాక తనపై మోపిిన నేరాలకు ఉరిశిక్ష విధించినా పర్వాలేదంటున్నారు. తన వల్ల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు బలహీనపడటం ఇష్టం లేదంటున్నారు. అలాగే భారత్ సాయంతో బంగ్లా సర్కార్ తో రహస్య డీల్ కుదుర్చుకున్నట్లు వస్తున్న వార్తలపైనా హసీనా స్పందించారు. న్యూస్ 18 ఇండియాకు ఇచ్చిన తాజా ఇంటర్వూలో హసీనా.. దీనిపై క్లారిటీ ఇచ్చారు. బంగ్లాదేశ్‌తో భారతదేశానికి ఉన్న స్నేహానికి తాను ఎప్పుడూ విలువనిచ్చానని తెలిపారు. కానీ బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలన్న తన నిర్ణయం పూర్తిగా సొంత రాజకీయ, నైతిక నిర్ణయం అన్నారు. భారతదేశం మిత్రదేశమే, కానీ బంగ్లాదేశ్ తన మాతృభూమి అన్నారు. తాను తన దేశానికి దూరంగా అనిశ్చిత కాలం పాటు ఉండలేనన్నారు. చివరిగా ఢాకా ప్రభుత్వంతో తనకు ఎటువంటి రాజకీయ అవగాహన లేదన్నారు.














Click it and Unblock the Notifications