20 ఏళ్ళ తర్వాత యూకేలో అతి చిన్న శిశువు జననం; బరువు అరకిలోకు తక్కువే!!
యూకేలో అరుదైన ఘటన జరిగింది. 17 సంవత్సరాల వయసున్న యువతి నెలలు నిండని ఒక పసిబిడ్డకు జన్మనిచ్చింది. 325 గ్రాములు అతి తక్కువ బరువు ఉన్న ఈ పసికందు గత 20 సంవత్సరాలలో యూకేలో జన్మించిన అతి తక్కువ బరువున్న శిశువుగా పరిగణించబడుతోంది. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యంగా ఉంది.
ఎల్లీ పాటన్, 17 సంవత్సరాల వయసున్న బాలిక అత్యవసర సి-సెక్షన్ తర్వాత కేవలం 25 వారాల శిశువు హన్నాకు జన్మనిచ్చింది. పుట్టినప్పుడు నవజాత శిశువు బరువు కేవలం 325 గ్రాములు ఉందని వైద్యులు తెలిపారు. ఈ శిశువు బతికే అవకాశం 20 శాతం మాత్రమే అని వైద్యులు వెల్లడించారు. తన బిడ్డ రాత్రి వరకు కూడా బ్రతుకక పోవచ్చని తల్లికి చెప్పారు వైద్యులు. కానీ పాప హన్నా మాత్రం ప్రాణాల కోసం పోరాడేంత దృఢంగా ఉంది. ప్రస్తుతం పాప వెంటిలేటర్ మీద ఉంది. అయినప్పటికీ ఆరోగ్యంగా ఉంది.

ఎల్లీ మరియు ఆమె భాగస్వామి బ్రాండన్ స్టిబుల్స్ తన 22 వారాల స్కాన్‌లో వారి బిడ్డ చాలా చిన్నదిగా ఉందని వైద్యులు చెప్పారని వెల్లడించారు. హన్నా 16 వారాల పిండం పరిమాణంలో ఉన్నట్లు స్కాన్‌లో తేలిందని వారు చెప్పారు. ఇక తల్లి విపరీతమైన కడుపు నొప్పి నడుము నొప్పితో బాధపడుతున్న ఎల్లీని డిసెంబర్ 29న ఐర్‌షైర్‌లోని కిల్‌మార్నాక్‌లోని క్రాస్‌హౌస్ ఆసుపత్రికి తరలించారు. గర్భవతి అయిన తల్లిని గ్లాస్గోలోని క్వీన్ ఎలిజబెత్ యూనివర్శిటీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె డిసెంబర్ 30న హన్నాకు జన్మనిచ్చింది.
హన్నా అసలు పుట్ట వలసిన గడువు తేదీ ఏప్రిల్ 13 కాగా డిసెంబర్ 30 నే హన్నా జన్మించింది. అతి తక్కువ బరువుతో పుట్టిన ఆ బిడ్డ బ్రతకదని వైద్యులు చెప్పినప్పటికీ పుట్టినప్పటినుండి ఇప్పటివరకు శిశువు 25 గ్రాములు పెరిగింది. హన్నా కంటే ముందు యూకేలో జన్మించిన అతి చిన్న పాప 2003లో అలియా హార్ట్, పుట్టినప్పుడు 340 గ్రాముల బరువు కలిగి ఉంది. సహజంగా ఇటువంటి కేసులలో శిశువు జీవించి ఉండడం చాలా అరుదు. కానీ హన్నా అతి తక్కువ బరువు ఉన్నప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. ఇంకా ప్రాణాల కోసం పోరాడేంత దృఢంగా,ఉత్సాహంగా కనిపిస్తుంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications