భారతీయ విద్యార్దులకు కెనడా షాకులు..! ప్రతీ నలుగురిలో ముగ్గురు అవుట్..!
భారతీయ విద్యార్ధులకు విదేశాల్లో చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా నుంచి మొదలైన ఈ విధాన పరమైన మార్పులు ఇప్పుడు అన్ని దేశాలకూ పాకుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో భారతీయ విద్యార్ధుల వీసాల పునరుద్దరణ, కొత్త వీసాల జారీ వంటి విషయాల్లో షాకులు తగులుతుండగా.. ఇప్పుడు కెనడాలో సైతం అదే పరిస్ధితి ఎదురవుతోంది. ఈ ఏడాది ఆగస్టులో భారతీయ విద్యార్ధుల వీసాల విషయంలో కెనడా స్పందన చూస్తే ఇదే నిజమని అర్దమవుతోంది.
వలసల్ని నియంత్రించేందుకు గత రెండేళ్లుగా కెనడా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా అమెరికా వంటి దేశాల్ని చూసి కెనడాలోనూ అక్కడి ప్రభుత్వం వలసల విషయంలో కొరడా ఝళిపిస్తోంది. దీంతో గతంలో భారతీయ విద్యార్ధుల్ని ఆహ్వానించిన కెనడా కాస్తా ఇప్పుడు రావొద్దని తేల్చిచెప్పేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో భారతీయ విద్యార్ధులు వీసాల కోసం దాఖలు చేసుకున్న దరఖాస్తులు భారీగా తిరస్కరణకు గురయ్యాయి. ప్రతీ నాలుగు దరఖాస్తుల్లో మూడింటిని కెనడా తిరస్కరించింది.

కెనడా ప్రభుత్వం తాత్కాలిక వలసదారులు, తప్పుడు అడ్రస్ లతో వీసాలు పొందుతున్న విదేశీ విద్యార్ధుల సంఖ్యను తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భారత్ కు చెందిన 74 శాతం వీసా దరఖాస్తులు ఈసారి తిరస్కరణకు గురయ్యాయి. రెండేళ్ల క్రితం అంటే 2023లో ఇలా తిరస్కరణకు గురైన దరఖాస్తులు కేవలం 32 శాతం మాత్రమే. ఇప్పుడు ఆ సంఖ్య కాస్తా 74 శాతానికి చేరిపోయింది. భారత్ ఒక్కటే కాదు ఆగస్టు 2025లో దాదాపు 24 శాతం చైనా విద్యార్దుల వీసాలు కూడా తిరస్కరణకు గురయ్యాయి.

దీంతో పాటు కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్ధుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. ఈ ఏడాది ఆగస్టులో కెనడాకు రెండేళ్లకు క్రితం విద్యార్ధి వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారితో పోలిస్తే కేవలం నాలుగో వంతు మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 2023 ఆగస్టులో 20,900 మంది భారతీయ విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా.. అది ఈ ఏడాది ఆగస్టు నాటికి 4,515కి తగ్గింది. గత దశాబ్దంలో కెనడాకు అంతర్జాతీయ విద్యార్థుల అత్యధిక వనరుగా భారతదేశం ఉంది. కానీ ఇప్పుడు పరిస్ధితి మారిపోయింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications