రక్తమోడిన కెనడియన్ హైస్కూల్- మాస్ షూటింగ్: 10 మంది దుర్మరణం
కెనడాలోని ఓ హైస్కూల్ లో భారీగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. 25 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, భద్రత సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక షూటర్ మృతి చెందాడు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
కెనడా బ్రిటిష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కాల్పుల విషయాన్ని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) ధృవీకరించింది. ఇందులో ఎంతమంది పాల్గొన్నారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, ఒకరి కంటే ఎక్కువమందే కాల్పులకు దిగి ఉండొచ్చని అనుమానిస్తోన్నట్లు తెలిపింది. తాము జరిపిన ఎదురు కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరో యాక్టివ్ షూటర్.. హైస్కూల్ ఆవరణలో ఉన్నట్లు నిర్ధారించింది.

ఈ కాల్పులకు తెగబడిన వారిలో ప్రధాన అనుమానితుడు మృతి చెందినట్లు భావిస్తున్నామని కెనడియన్ పోలీసులు వెల్లడించినట్లు ఫాక్స్ న్యూస్ తెలిపింది. రెండో అనుమానితుడు ఇంకా స్కూల్ ఆవరణలోనే ఉన్నాడని, బాధితుల సంఖ్య ఎంత అనే విషయాలపై అధికారులు విచారణ జరుపుతున్నారని పేర్కొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే మోహరించి ఉన్నారు. స్థానికంగా అత్యవసర హెచ్చరికను జారీ చేశారు.
టంబ్లర్ రిడ్జ్ ప్రాంతంలో నివసించే ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు బయటికి రావొద్దని సూచించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు పొరుగు డిటాచ్‌మెంట్‌ల నుండి అదనపు పోలీసు బలగాలు, అలాగే నార్త్ డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంను టంబ్లర్ రిడ్జ్ కు పంపించారు. భద్రతా చర్యలను, సహాయక కార్యకలాపాలను ముమ్మరం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ప్రావిన్షియల్ వెబ్‌సైట్ ప్రకారం టంబ్లర్ రిడ్జ్ సెకండరీ పాఠశాలలో 175 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ 7 నుండి 12వ గ్రేడ్ వరకు తరగతులు ఉన్నాయి. ఎలిమెంటరీ స్కూట్ కూడా దీనికి ఆనుకునే ఉంటుంది. కాల్పులు సెకండరీ స్కూల్ ఆవరణలో సంభవించాయి. కాల్పుల ఉదంతం సంభవించిన వెంటనే ఈ రెండింటినీ కూడా మూసివేసినట్లు పీస్ రివర్ సౌత్ స్కూల్ డిస్ట్రిక్ట్ తెలిపింది. ఆర్‌సీఎంపీ, అంబులెన్స్ సహాయంతో సహా అదనపు బలగాలను సంఘటన స్థలానికి పంపించినట్లు పీస్ రివర్ సౌత్ ప్రతినిధి లారీ న్యూఫెల్డ్ తెలిపారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications