రష్యా-ఉక్రెయిన్ మధ్యవర్తిత్వానికి రెడీ-జెలెన్ స్కీకి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆఫర్..

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయినా ఇంకా యుద్దం ఆగలేదు. ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం నెరిపేందుకు పలు దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇరువురూ వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఇరుదేశాలకూ నష్టం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఫోన్ చేశారు.

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్... ఉక్రెయిన్ అధినేత జెలెన్స్‌కీకి తొలిసారి ఫోన్ చేశారు. ఇందులో రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని ముగించడానికి కాల్పుల విరమణ, రాజకీయ పరిష్కారాన్ని తీసుకురావడానికి మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చారు. కైవ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన జెలెన్ స్కీని కోరారు. ఇరుదేశాల మధ్య అణ్వస్త్ర దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటివరకూ అణుయుద్ధంలో విజేతలు లేరని గుర్తుచేసారు.

xi jinping offer mediation on russia-ukraine war, calls zelenskyy

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రియమైన స్నేహితుడిగా అభివర్ణించిన జిన్ పింగ్.. మాస్కోలో తన గత నెల పర్యటన అనుభవాల్ని గుర్తుచేశారు. మాస్కో పర్యటన తర్వాత సంవత్సరానికి పైగా కొనసాగుతున్న సంఘర్షణను ముగించడానికి మధ్యవర్తిత్వం వహించే ఆలోచనతో జెలెన్స్కీతో మాట్లాడుతూ సంభాషణ, చర్చలు ముందుకు సాగే ఏకైక మార్గం, మరియు కాల్పుల విరమణపై చర్చలు జరపడానికి ప్రత్యేక రాయబారిని పంపడానికి ప్రతిపాదించారు.

అణు యుద్ధంలో విజేత లేడని, అణు సమస్యపై అన్ని భాగస్వామ్య పక్షాలు ప్రశాంతంగా ఉండాలని జిన్ పింగ్ రష్యా, ఉక్రెయిన్ అధినేతల్ని కోరారు. సంయమనం పాటించాలన్నారు. వారి స్వంత భవిష్యత్తు, మానవాళి ప్రయోజనాల కోసం నిజంగా పని చేయాలని సూచించారు. అలాగే సంక్షోభాన్ని సంయుక్తంగా ఎదుర్కోవాలన్నారు. హేతుబద్ధమైన ఆలోచనలు, స్వరాలు ఇప్పుడు పెరుగుతున్నందున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం, సంక్షోభం యొక్క రాజకీయ పరిష్కారానికి అనుకూలమైన పరిస్థితులను నిర్మించడం చాలా ముఖ్యమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+