మగవారిని బుట్టలో వేసుకోవడం ఎలా? కోర్సుతో కోట్లు గడిస్తోన్న అందాల భామ!

చైనాకు చెందిన ఓ ఇన్ఫ్లయెన్సర్ మహిళలకు ఫ్లర్టింగ్(Flirting) పాఠాలు చెబుతూ ఏకంగా కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన జౌ యువాన్(47) ఫ్లర్టింగ్ పాఠాలు నేర్పిస్తూ ఏకంగా రూ.32 కోట్లు సంపాదించారు. ఒకప్పుడు ఓ బ్యాంకులో జౌ యువాన్ సాదాసీదా ఉద్యోగిగా పని చేసేవారు. కానీ ఆ ఉద్యోగం బోర్ కొట్టిందో ఏమో కానీ.. దానిని వదిలేసి ఓ బ్యూటీ పార్లర్ పెట్టారు. అక్కడితో ఆగకుండా మహిళలకు పురుషులను ఎలా ఆకర్షించాలో నేర్పడానికి ఏకంగా 'బ్లాక్ అండ్ వైట్ సెక్సువల్ ఇంటెలిజెన్స్ స్కూల్' అనే ఒక వింత స్కూల్ ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

జౌ యువాన్ నేర్పే ఆ వింత పాఠాలు ఏంటి?
జౌ యువాన్ దృష్టిలో 'సెక్సువల్ ఇంటెలిజెన్స్' అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు. ఎదుటివారిని మనవైపు తిప్పుకునే ఆత్మవిశ్వాసం, మాట్లాడే తీరు కూడా ఇందులో భాగమే అని ఆమె చెబుతారు. ఆమె క్లాసుల్లో కొన్ని చిత్రమైన చిట్కాలు నేర్పిస్తుంటారు. ఉదాహరణకు, ఎవరినైనా చూసేటప్పుడు కళ్లతో, శరీరంతో ఒక 'X' ఆకారం చేయాలని ఆమె వివరిస్తారు. అలాగే మాట్లాడేటప్పుడు గొంతును చాలా మెత్తగా ఉంచి, ప్రతి మాట చివరలో కాస్త రాగం తీసినట్లుగా మాట్లాడాలని తన స్టూడెంట్స్ కు శిక్షణ ఇస్తారు. మొత్తం మీద చూపులు, ఎక్స్‌ప్రెషన్స్, వాయిస్ మాడ్యులేషన్‌తో భర్తలను లేదా పార్ట్‌నర్లను ఎలా అట్రాక్ట్ చేయాలో చెబుతారు. ముఖ్యంగా 'X-షేప్' ఐ కాంటాక్ట్ వంటి ఆమె ట్రిక్స్ వైరలయ్యాయి. వేలాది మంది మహిళలు లక్షలు ఖర్చు చేసి మరీ ఆమె వర్క్‌షాప్స్‌లో పాల్గొంటున్నారు.

Chinese Influencer Zhou Yuan Earns Rs 32 Crore Teaching Flirting Skills to Women Details Here

కోట్లలో సంపాదన.. అంతా ఆన్‌లైన్ మ్యాజిక్!
ఇలాంటి పాఠాలు ఎవరు వింటారు అని మనం అనుకోవచ్చు కానీ, ఆమె సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఆన్‌లైన్‌లో కేవలం రూ. 115 రూపాయలకే చిన్న చిన్న కోర్సులు అమ్మడమే కాకుండా, పర్సనల్ గా నేర్పించడానికి ఏకంగా రూ. 10 లక్షల వరకు వసూలు చేస్తారు. ఇలా కేవలం ఈ ఫ్లర్టింగ్ పాఠాలు నేర్పించి ఆమె ఇప్పటివరకు సుమారు రూ. 32 కోట్లు వెనకేశారు. గతేడాది ఆమె నిర్వహించిన ఒక స్పెషల్ క్యాంప్‌కు ఎంతోమంది ధనిక మహిళలు క్యూ కట్టడం విశేషం.

వివాదాలు, సోషల్ మీడియా నిషేధం
సంపాదన ఎంత ఉన్నా, ఈమెపై విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. "మహిళలకు ఆత్మవిశ్వాసం నేర్పడం పక్కన పెట్టి, పురుషులకు ఎలా దాసోహం అవ్వాలో నేర్పిస్తున్నారు" అని కొందరు తిట్టిపోస్తున్నారు. ఆమె వీడియోలు అశ్లీలంగా ఉన్నాయని ఆరోపణలు రావడంతో, చైనా ప్రభుత్వం ఇటీవల ఆమె సోషల్ మీడియా అకౌంట్లను నిషేధించింది. అయితే జౌ యువాన్ మాత్రం తన పాఠాలు మహిళలను మానసికంగా స్ట్రాంగ్ చేస్తాయని, వారి జీవితాన్ని వారి కంట్రోల్‌లో ఉంచుతాయని గట్టిగా వాదిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+