వాళ్ల వల్ల డల్లాస్ సర్వనాశనం
అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టెక్సాస్ లో ఇస్లామీకరణ శరవేగంగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము డల్లాస్ లో నివసిస్తోన్నట్టు లేదని, పాకిస్తాన్ లో ఉన్నట్టు ఉందని తేల్చి చెప్పారు. టెక్సాస్.. ప్రత్యేకించి డల్లాస్ లో ఈ తరహా వాతావరణం ఉందని అన్నారు. మసీదులు, కొన్ని షాపింగ్ మాల్స్ లను చూస్తోంటే పాకిస్తాన్‌లో ఉన్నామనే కలుగుతోందని, అక్కడి వాతావరణం, స్థితిగతులు ఇక్కడ కనిపిస్తోన్నాయని విమర్శించారు.
యూరప్ చేసిన తప్పుల నుండి అమెరికా గుణపాఠం నేర్చుకోవాలని బ్రాండన్ గిల్ హెచ్చరించారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై పోస్ట్ చేశారు. యూఎస్ కాంగ్రెస్ లో టెక్సస్ 26వ డిస్ట్రిక్ట్ కు ఆయన ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్నారు. అమెరికాలో అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ సభ్యుడు. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది. ఇస్లామిక్ వలసలు అమెరికాను నాశనం చేస్తున్నాయని తేల్చి చెప్పారు.

రియల్ అమెరికాస్ వాయిస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్ మాట్లాడారు. స్థానిక అమెరికన్ ఓటర్ల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను ఉటంకించారు. డల్లాస్ ప్రాంతంలో ఇస్లామీకరణ శరవేగంగా జరుగుతోందని ఓటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, దీనిపై నిరంతరం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు. షాపింగ్ మాల్స్‌లో గమనిస్తున్న మార్పులను ఓటర్లు తన దృష్టికి తీసుకొచ్చారని, అక్కడి పరిస్థితుల గురించి వివరించారు.
మన కమ్యూనిటీలు, మన సంస్కృతి, మనం ఇష్టపడే ఈ డల్లాస్.. ప్రాథమిక మూలాల నుంచి క్రమేణా రూపాంతరం చెందుతోందని, దీనికి కారణం ఇస్లామీకరణ, వలసలే కారణమని స్పష్టం చేశారు. గిల్ వ్యాఖ్యలు టెక్సాస్‌లోని ముస్లిం కమ్యూనిటీ సభ్యులతో సహా అనేకమందిలో ఆగ్రహం రేపాయి. ఈ వ్యాఖ్యల పట్లు పలువురు ప్రముఖులు స్పందించారు. విభజనను ప్రోత్సహించేలా ఉన్నాయని మండిపడ్తారు. అమెరికన్ ముస్లింలను అకారణంగా లక్ష్యంగా చేసుకుంటున్నాయని విమర్శించారు. ఇస్లామోఫోబిక్ ఫాసిస్ట్ గా అభివర్ణిస్తోన్నారు.












Click it and Unblock the Notifications