సకాలంలో గుర్తించారు కాబట్టి సరిపోయింది..!!

కిందటి నెల అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో 270 మంది దుర్మరణం పాలయ్యారు. విమానంలో ఒక్కడు మినహా మిగిలిన ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. దీని తరువాత ఎయిరిండియా విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం కనిపించింది. ప్రయాణికులను భయాందోళనలకు గురి చేసింది.

తాజాగా అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానం ఇలాంటి ముప్పునే ఎదుర్కొంది. అట్లాంటాకు బయలుదేరిన డెల్టా విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో లాస్ ఏంజిల్స్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఏడాదిలో డెల్టాకు సంబంధించి ఇది రెండో సంఘటన ఇది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దీనిపై దర్యాప్తు చేస్తోంది.

Delta s Boeing 767 engine catches fire shortly after takeoff

లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అట్లాంటాకు బయలుదేరిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానం DL446 (బోయింగ్ 767-400, రిజిస్ట్రేషన్ N836MH) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎడమ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విమానం గాల్లో ఉండగానే దాని ఎడమ ఇంజిన్ నుండి మంటలు రావడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. లాస్ ఏంజిలిస్ లో టేకాఫ్ తీసుకున్న విమానం మొదట పసిఫిక్ మహాసముద్రం మీదుగా కొంత దూరం వెళ్ళింది.

ఆ తరువాత డౌనీ అండ్ పారామౌంట్ మీదుగా వెనక్కి మళ్లింది. విమానం ల్యాండ్ అయ్యేంత వరకు ఒకే ఎత్తు, వేగంతో ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన వెంటనే గ్రౌండ్ స్టాఫ్.. మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ప్రయాణికులకు గానీ సిబ్బందికి గాని గాయాలు కాలేదు.

ఈ సంఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. మంటలు ఎలా చెలరేగాయనే విషయంపై ఆరా తీస్తోన్నాయి. ఈ విమానంలో రెండు జనరల్ ఎలక్ట్రిక్ CF6 ఇంజిన్లు ఉన్నాయి. ఈ ఏడాదిలో డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడం ఇది రెండోసారి.

జనవరిలో- అట్లాంటా నుండి బ్రెజిల్‌లోని సోపాలోకు వెళుతున్న ఎయిర్‌బస్ A330neo విమానం DL105 కూడా టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్‌లో సమస్య రావడంతో వెనక్కి వచ్చింది. కిందటి నెలలో కూడా అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం ఇదే తరహా ముప్పును ఎదుర్కొంది.

153 మంది ప్రయాణికులతో ఎయిర్ బస్ ఏ321 ఫ్లైట్ నంబర్ 1665.. ఇక్కడి హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నార్త్ కరోలినాకు బయలుదేరింది. ఛార్లొటె డగ్లస్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కావాల్సి ఉంది. టేకాఫ్ తీసుకున్న మరుక్షణమే విమానానికి చెందిన ఓ ఇంజిన్ నుంచి నల్లటి పొగ వెలువడింది. ఆ సమయంలో ఇంజిన్ లో స్వల్పంగా మంటలు చెలరేగాయి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+