ఇరాన్ అణుపరీక్ష చేసేసిందా ? అమెరికా, ఇజ్రాయెల్ కు బిగ్ షాక్..! ఆ భూకంపం ?
ఇరాన్-అమెరికా మధ్య అణుచర్చలు విఫలమైన తర్వాత రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ యుద్ధానికి తెరలేపింది. ఇరాన్ తో హోరాహోరీగా పోరాడిన ఇజ్రాయెల్ ఓ దశలో ఎదురుదెబ్బలు తినడంతో నేరుగా అమెరికానే రంగంలోకి దిగింది. ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై బాంబులు, క్షిపణుల వర్షం కురిపించింది. అయితే ఇదంతా ఓ ఎత్తయితే అమెరికా ఈ యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వాల్సినంత పరిస్దితి ఎందుకు ఎదురైందనే దానికి నిదర్శనంగా ఓ సంచలన వార్త చక్కర్లు కొడుతోంది.
ఇజ్రాయెల్ తో యుద్దంలో ఇరాన్ కు ఎదురుదెబ్బలు తప్పలేదు. అమెరికా ఆయుధాలతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ను ఎదుర్కొనేందుకు తమ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలు, క్షిపణుల్ని బయటికి తీసిన ఇరాన్.. అప్పటికీ పైచేయి సాధించలేకపోవడంతో చివరిగా అణు పరీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉత్తర ఇరాన్ లోని ఎడారి ప్రాంతంలో నిర్వహించిన ఈ అణు పరీక్ష ద్వారా తమకు అణుబాంబు తయారు చేసుకునే సామర్ద్యం ఉందని అమెరికా, ఇజ్రాయెల్ కు తెలియచెప్పింది.

గత శుక్రవారం ఉత్తర ఇరాన్ లో నిర్వహించిన ఈ అణు పరీక్ష ధాటికి ఆ ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చిందన్న వార్తలు ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు వీరి మిత్ర దేశాల్ని సైతం కలవరపెడుతున్నాయి. ఎందుకంటే తమ దాడులతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకున్నామని, అణు స్ధావరాల్ని దెబ్బతీశామని, ఇప్పట్లో ఇరాన్ అణుబాంబు గురించి ఆలోచించడమే కష్టమని ఇజ్రాయెల్, అమెరికా చెప్పుకుంటున్న వేళ ఈ అణు పరీక్ష వార్తలు, వీడియోలు బయటపడుతుండటం సంచలనం రేపుతోంది.

ఇరాన్ లోని సెమ్నెన్ నగరానికి 27 కిలోమీటర్ల దూరంలో ఈ అణు పరీక్ష జరిగిందని తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. ఈ అణు పరీక్ష తర్వాతే ఉలిక్కిపడ్డ అమెరికా ఇరాన్ లోని అణు కేంద్రాలపై దాడులకు దిగిందన్న చర్చ మొదలైంది. అయితే ఈ దాడుల్లోనూ ఇరాన్ అణు కేంద్రాల్ని అమెరికా పూర్తిగా దెబ్బతీయలేకపోయిందన్న నిఘా ఏజెన్సీల నివేదికలు ట్రంప్ ను ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. ఇప్పటికే అణు స్ధావరాలపై దాడుల తర్వాత పశ్చిమాసియాలోని తమ స్థావరాలపై ఇరాన్ దాడులకు దిగడంతో హఠాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించేసిన ట్రంప్ .. ఇప్పుడు దాన్ని అంగీకరించేందుకు ఇష్టపడటం లేదు.












Click it and Unblock the Notifications