కారు నడిపిన కుక్క: యాక్సిడెంట్ చేసింది
న్యూయార్క్: కారులో ఉన్న ఓ కుక్క సరదాగా కారు స్టార్ట్ చేసి ముందుకు నడపడంతో పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ప్రజలు పరుగులు తీసిన సంఘటన అమెరికాలో జరిగింది. చివరికి అక్కడ ఉన్న వారు కారు దగ్గరకు వెళ్లి చూడగా అందులో కుక్క ఉండటంతో షాక్ కు గురైనారు.
యజమాని లేని సమయంలో కారు నడిపిన ఓ కుక్క యాక్సిడెంట్ చేసింది. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో ఇటీవల జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓ షాపింగ్ మాల్ ప్రాంగణంలో మహిళ తన కారు పార్క్ చేసింది.
తరువాత తన రెండు పెంపుడు కుక్కలను కారులో వదిలి షాపింగ్ మాల్ లోకి వెళ్లారు. అదే అదునుగా భావించిన కుక్క కారు స్టార్ట్ చేసింది. గేర్ మార్చి ముందుకు నడిపింది. అంతే చుట్టుపక్కల ఉన్న వారు భయంతో పరుగు తీశారు.

కారు మాల్ దగ్గర ఉన్న కాంక్రీట్ పిల్లర్ ను డీకొని నిలిచిపోయింది. తరువాత స్థానికులు కారు దగ్గరకు వెళ్లి చూడగా అందులో మనుషులు ఎవ్వరూ లేరని తెలుసుకున్నారు. కారులో రెండు కుక్కలు ఉన్నాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కారు యజమానురాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ రెండు పెంపుడు కుక్కలు నావే అని ఆమె పోలీసులకు చెప్పింది. రెండు కుక్కల్లో ఓ కుక్క డ్రైవింగ్ ఎలా చేసింది అని తెలియడం లేదని వాపోయింది. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో కారు యజమానిని హెచ్చరించిన పోలీసులు ఆమెను వదిలి పెట్టారు.
Dog crashes car into Walmart https://t.co/pg070g3w3r
— WSAZ NewsChannel 3 (@WSAZnews) July 29, 2016












Click it and Unblock the Notifications