ట్రంప్ ఘన కార్యాలను బయటపెట్టిన కమల
Donald Trump-Kamala Harris debate 2024: గడువు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.
ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ డిబేట్‌కు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో వారిద్దరి మధ్య ఏర్పాటైన తొలి డిబేట్ ఇదే.

పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా దీనికి వేదిక. అమెరికా కాలమాన ప్రకారం సరిగ్గా మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ డిబేట్ ఆరంభమైంది. లారా లూమర్.. దీనికి కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్నారు. ఏబీసీ న్యూస్ ఈ డిబేట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
డిబేట్ సందర్భంగా కమలా హ్యారిస్.. డొనాల్డ్ ట్రంప్ పాలనపై ఘాటు విమర్శలు చేశారు. ఆయన హయాంలో ఖజానా ఖాళీ అయిందని, నిరుద్యోగం, ఆర్థిక భారం పడటానికి ఆయన పరిపాలనే ప్రధాన కారణమంటూ ఆరోపించారు. ప్రజారోగ్యం సైతం సరిదిద్దడానికి వీలులేనంతగా ధ్వంసమైందంటూ విమర్శించారు.
తన హయాంలో అమెరికన్లను చైనాకు అమ్మేశాడంటూ కమలా హ్యారిస్ మండిపడ్డారు. సొంత దేశంపై కంటే చైనా మీద, అక్కడి ఎకానమీ మీద ఎక్కువ శ్రద్ధ చూపించాడని చెప్పారు. చైనా రక్షణ రంగం మరింత బలోపేతం చేసేలా పరిపాలన సాగించారని, ఇక్కడి మైక్రో చిప్స్‌ను అక్కడ ఉదారంగా విక్రయించారంటూ ధ్వజమెత్తారు. దీనివల్ల చైనా ఆర్మీ ఎప్పుడూ లేనంతగా ఆధునికీకరణకు నోచుకుందని చెప్పారు.
21వ శతాబ్దంలో అమెరికాతో పోటీ పడేలా చైనా తన విధానాలను, అందుకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటోందని కమలా హ్యారిస్ అన్నారు. దీనికి కారణం- డొనాల్డ్ ట్రంప్ పరిపాలనేనని పేర్కొన్నారు. అదే సమయంలో సొంత దేశ ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోలేదని విమర్శించారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో దాన్ని నిరోధించడానికి చైనా తీసుకున్న నిర్ణయాలనూ ట్రంప్ సమర్థించాడని, మావో జెడాంగ్ తరువాత ఆ స్థాయి శక్తిమంతమైన అధినేతగా గ్ఝి జిన్‌పింగ్‌ను కీర్తించారని గుర్తు చేశారు. కోవిడ్ పుట్టుకకు కారణమైన చైనాను ట్రంప్ ప్రశంసించడంలో అర్థం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications