అమెరికాలో కెనడా విలీనం- 51వ రాష్ట్రం? కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్

Canada merger with US: ఇంకొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డొనాల్డ్ ట్రంప్. గత ఏడాది నవంబర్ 5వ తేదీన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌ను చిత్తు చేశారు.

ప్రమాణ స్వీకార ఏర్పాట్లు..

ఈ నెల 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాజధాని వాషింగ్టన్ డీసీలో ఆ దేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభమౌతుంది.

President-elect Donald Trump has intensified his controversial statements about Canada sharing maps on social media that falsely depict the country as part of the United States

కొత్త ప్రతిపాదనలు..

ఈ పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వివాదానికి, సంచలనానికీ తెర తీశారు. పొరుగుదేశం కెనడాను విలీనం చేసుకోడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలు అవి. దీనికి సంబంధించిన రెండు కొత్త మ్యాప్‌లను కూడా తన సొంత, అధికారిక ట్రూత్ సోషల్ ప్లాట్ ఫామ్‌పై పోస్ట్ చేశారు. అమెరికా, కెనడా దేశాలపై జాతీయ జెండా పరిధిలోకి తీసుకొచ్చారు. Oh Canada! అనే క్యాప్షన్ దానికి జత చేశారు.

51వ రాష్ట్రంగా..

ఈ మ్యాప్‌ను పోస్ట్ చేయడానికి కొన్ని గంటల ముందే- దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తెర మీదికి తీసుకొచ్చారాయన. తన సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కెనడాను 51వ రాష్ట్రంగా గుర్తిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ తరువాతే ఈ కొత్త మ్యాప్‌ను పోస్ట్ చేశారు. కెనడాను విలీనం చేసుకోవడానికి ఎకనామిక్ ఫోర్స్ను ప్రయోగిస్తాననీ వ్యాఖ్యానించారు.

ఫ్లోరిడా ప్రెస్ మీట్‌లో..

ఫ్లోరిడాలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని కెనడాను విలీనం చేసుకోవాలని భావిస్తోన్నానని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తన వద్ద ఉన్నాయని వ్యాఖ్యానించారు. కెనడా భద్రత దృష్ట్యా అమెరికాలో విలీనం కావడమే మంచిదని పేర్కొన్నారు.

డిపెండెన్సీ..

కెనడా రక్షణ శాఖ పరిధి చాలా పరిమితంగా ఉంటోందని, ఎక్కువగా తమ దేశ సైనిక శక్తి మీద ఆధారపడుతోందని డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేశారు. దీనికోసం ఆ దేశం తమకు భారీ మొత్తాన్ని చెల్లిస్తోందని, ఇది సరికాదని ట్రంప్ తేల్చి చెప్పారు.

సైనిక చర్యకు నో..

సైనిక చర్య ద్వారా కెనడాను విలీనం చేసుకోవాలనుకుంటున్నారా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు నో అంటూ సమాధానం ఇచ్చారు. ఎకనమిక్ ఫోర్స్ ద్వారా కెనడాను విలీనం చేసుకోవాలనుకుంటోన్నానని, దీనివల్ల కెనడా ఆర్థికంగా ఎంతో శక్తిమంతమౌతుందని చెప్పారు. అమెరికాను మళ్లీ స్వర్ణయుగంలోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ట్రుడోతో సత్సంబంధాలు..

కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా గుర్తించడాన్ని రెండు దేశాల ప్రజలు స్వాగతిస్తారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడోతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, 2017- 2021 మధ్యకాలంలో తమ రెండు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు అత్యున్నత స్థాయిలో కొనసాగాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+