Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుతిన్ షరతులు ఒప్పుకో! - జెలెన్‌స్కీని బెదిరించిన ట్రంప్!!

Donald Trump: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వైట్‌హౌస్‌లో జరిగిన రహస్య భేటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైట్‌హౌస్‌లోని ఓ గదిలో అగ్రనేతలు ఇద్దరు ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ట్రంప్ కోపం, అరుపులు, ఆగ్రహంతో కూడా సౌండ్లు వినిపించినట్లు సమాచారు. పుతిన్ షరతులను అంగీకరించకపోతే ఉక్రెయిన్ నామరూపాలు లేకుండా పోతుందని ట్రంప్, జెలెన్‌స్కీని బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ సమావేశంలో ఏం జరిగిందనే విషయాలను యూరోపియన్ అధికారులు లీక్ చేయగా, ఆ వివరాలు వెలుగులోకి వచ్చాయి. పుతిన్ చేసిన 'స్పెషల్ ఆపరేషన్' వంటి తప్పుడు వాదనలను కూడా ట్రంప్, జెలెన్‌స్కీ ముందు పునరుద్ఘాటించారు. ఈ పరిణామంతో జెలెన్‌స్కీ బృందం దిగ్భ్రాంతికి గురైంది.

మ్యాప్‌లు విసిరేసి ఆగ్రహం
సమావేశం మధ్యలో ట్రంప్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రష్యా దాడులు జరుగుతున్న ఫ్రంట్‌లైన్ మ్యాప్‌లను ఉక్రెయిన్ బృందం చూపించింది. అయితే ట్రంప్‌కు అవన్నీ అర్థం లేనివిగా అనిపించాయి. ఆయన ఆ మ్యాప్‌లను గాలిలోకి విసిరేస్తూ.. "ఈ ఎర్ర గీత ఏమిటి? ఇదంతా అర్ధం లేనిది. నేను అక్కడికి ఎప్పుడూ వెళ్లలేదు!" అని గట్టిగా అరిచారు. డొనాల్డ్ ట్రంప్ పదేపదే అసభ్య పదజాలం ఉపయోగించారని ఓ యూరోపియన్ అధికారి వెల్లడించారు. ఉక్రెయిన్ బాధను చెప్పే ఆ మ్యాప్‌లు, ట్రంప్‌కు కేవలం కాగితపు ముక్కలుగానే కనిపించాయి. జెలెన్‌స్కీ అమెరికా నుంచి అత్యంత శక్తివంతమైన మిస్సైల్‌ల కోసం వేడుకోగా.. ట్రంప్ వాటికి స్పష్టంగా నిరాకరించారు.

Donald Trump Stark Warning to Zelensky at White House Meeting

పుతిన్ షరతులు రుద్దడం
పూర్తి డొన్‌బాస్ ప్రాంతాన్ని పుతిన్‌కు అప్పగించాలని ట్రంప్, జెలెన్‌స్కీపై ఒత్తిడి తెచ్చారు. మొదట్లో డొనాల్డ్ ట్రంప్ ఫ్రంట్‌లైన్‌ను ఉన్న స్థితిలోనే ఉంచాలని సూచించినప్పటికీ.. త్వరలోనే పుతిన్ డిమాండ్లను అంగీకరించాలని బలవంతంగా రుద్దారు. "పుతిన్ అనుకుంటే, నిన్ను పూర్తిగా నాశనం చేయగలడు" అంటూ ట్రంప్ హెచ్చరించారు. ఈ మాటలు ఉక్రెయిన్ సైనికుల పోరాటాన్ని కించపరిచేలా ఉన్నాయి. అమెరికా వైఖరి ఎందుకు మారిందని జెలెన్‌స్కీ బృందం ఆశ్చర్యపోయింది. ట్రంప్ మాటల్లో రష్యా బలహీనతలను కప్పిపుచ్చే పుతిన్ మాటల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ సమావేశం ఉక్రెయిన్ యుద్ధంలో ఒక కీలక మలుపుగా పరిగణించవచ్చు.

అమెరికా సాయంపై షాక్
రష్యాపై ప్రభావవంతంగా పనిచేసే లాంగ్ రేంజ్ టోమహాక్ మిస్సైల్స్ కోసం జెలెన్‌స్కీ వాషింగ్టన్‌కు వచ్చారు. కానీ, ట్రంప్ "లేదు!" అని స్పష్టంగా నిరాకరించారు. ఈ నిరాకరణ కేవలం ఆయుధాలకు మాత్రమే కాదు.. అమెరికా-ఉక్రెయిన్ మధ్య ఉన్న స్నేహానికి కూడా నిరాకరణగా మారింది. సమావేశం అనంతరం జెలెన్‌స్కీ నిశ్శబ్దంగా తిరిగి వెళ్ళారు, కానీ ఆయన మనసులో "అమెరికా ఇక రష్యాకు మద్దతు ఇస్తుందా?" అనే ప్రశ్నలు మెదులుతున్నట్లు భావిస్తున్నారు. ట్రంప్ వైఖరి ఆయన 'అమెరికా ఫస్ట్' నినాదానికి అనుగుణంగా ఉందని.. ఉక్రెయిన్ యుద్ధం ఆయన ప్రాధాన్యతలలో లేదని తెలుస్తోంది.

ప్రపంచంపై ప్రభావం
ఈ ఘటన ప్రపంచ రాజకీయాలను కదిలించింది. ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఈ పద్ధతి సరైనదేనా? ట్రంప్ ఒత్తిడి ఉక్రెయిన్‌ను మరింత బలహీనపరుస్తుందా? ఈ 'డీల్' ఉక్రెయిన్‌ను రష్యాకు అమ్మేయడం లాంటిదేనా? అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఈ చర్య రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తుందా లేదో వేచి చూడాల్సిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+