ట్రెండ్ సెట్ చేసిన ట్రంప్
Donald Trump: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి.. పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ ఏడాది చివర్లో ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. జనవరి 20వ తేదీన ఆ దేశ కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయక్కడ.
2019 నాటి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. అధ్యక్షుడిగా, భారత సంతతికి చెందిన కమల హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పుడు మళ్లీ జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తోన్నారు.

రిపబ్లికన్ల తరఫున కూడా అభ్యర్థి మారలేదు. 2019 నాటి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనెటర్ జేమ్స్ డేవిడ్ వెన్స్ పేరు ఖరారైంది. ఈ రెండు పార్టీలు కూడా విస్తృతంగా ఎన్నికల ర్యాలీలను నిర్వహిస్తోన్నాయి.
తాజాగా విస్కాన్సిస్‌లోని మిల్వాకీలో నేషనల్ కన్వెన్షన్‌ను ఏర్పాటు చేసింది రిపబ్లికన్ పార్టీ. నాలుగు రోజుల పాటు జరిగే వర్క్ షాప్ ఇది. డొనాల్డ్ ట్రంప్ దీనికి హాజరయ్యారు. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఓ ర్యాలీలో కాల్పులు జరిగిన అనంతరం ట్రంప్ హాజరైన తొలి రాజకీయ సమావేశం ఇదే.
వివిధ రాష్ట్రాల సెనెటర్లు, భారీ సంఖ్యలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు, రిపబ్లికన్ పార్టీ అభిమానులు ఈ సభకు హాజరయ్యారు. వారిలో చాలామంది తమ కుడిచెవికి తెల్లటి బ్యాండేజ్‌ను కట్టుకుని రావడం హాట్ టాపిక్‌గా మారింది. అలా బ్యాండేజ్ కట్టుకున్న వారు పదుల సంఖ్యలో కనిపించారు.
పెన్సిల్వేనియాలో కాల్పులు జరిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ కుడి చెవికి బుల్లెట్ రాసుకెళ్లిన విషయం తెలిసిందే. రక్తమోడుతున్న చెవితో కనిపించారాయన. చెవికి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఆ సమయంలో కొద్దిరోజుల పాటు కుడి చెవికి బ్యాండేజీ కట్టుకున్నారు. దీనికి సింబాలిక్‌గా ఆయన అభిమానులు తాము కూడా కుడి చెవికి ఫేక్ బ్యాండేజీ కట్టుకుని రిపబ్లికన్ల జాతీయ స్థాయి కన్వెన్షన్‌కు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications