ఇరాన్ యుద్ధంలో ఓడిపోతోంది ఎవరు ? తెరవెనుక ఏం జరుగుతోంది ?

ఇరాన్ (IRAN)పై అమెరికా-ఇజ్రాయెల్ నెల రోజుల క్రితం ఉమ్మడిగా ప్రారంభించిన యుద్ధం మహా అయితే ఓ వారం, పది రోజులు సాగుతుందని ట్రంప్ (Donald Trump) సహా అంతా భావించారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఇరాన్ చూపించిన తెగువకు అమెరికా-ఇజ్రాయెల్ సహా ప్రపంచదేశాలన్నీ ఆశ్చర్యపోవడం ప్రారంభించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీని, టాప్ కమాండర్లను చంపేశాక ఇక ఆ దేశం తమకు లొంగిపోతుందని భావించిన అమెరికా-ఇజ్రాయెల్ కు ఇప్పుడు యుద్ధం రెండో నెలలోకి ప్రవేశించడం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఈ వార్ లో విజేత ఎవరో తేలిపోయింది.

నెల రోజుల్లో ఏం జరిగింది ? (iran war)

నెల రోజుల క్రితం యుద్దం ప్రారంభమైనప్పుడు ఇరాన్ సర్వనాశనం అయిపోయి అమెరికా-ఇజ్రాయెల్ కు లొంగిపోతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు రెండో నెలలోకి ఎంటరైన తర్వాత చూస్తే.. ఇరాన్‌ పెద్దగా కోల్పోయిందేమీ లేదు. అయితే అమెరికాకు మాత్రం చాలా కోల్పోయినట్లు అర్ధమవుతోంది. ఇందులో ఆర్థిక వ్యవస్థ, పెట్రోడాలర్ అధిపత్యం, ప్రతిష్ఠ ఇలా చాలానే ఉన్నాయి. ఇరాన్ ఈ యుద్ధంలో ఓడిపోయే స్థితిలో లేదు. అది కేవలం మరికొన్ని వారాలు మనుగడ సాగించడం ద్వారానే గెలువబోతోంది. వాస్తవానికి యుద్ధంలో ఎవరు ఓడిపోతున్నారో తెలుసుకోవాలంటే ఒక సులభమైన మార్గం శాంతిని ఎవరు అడుగుతున్నారో చూడడమే. ఈ లెక్కన చూస్తే ముందుగా ఓడిపోతోంది అమెరికా అని తేలిపోతోంది.

Donald Trump s Defeat Why Iran is Winning the Middle East War and America is Desperate

ఇరాన్ నేర్చుకున్న పాఠం

గతంలో అమెరికా ఇరాక్ లో 'షాక్ అండ్ ఆవ్' వ్యూహం తో పనిచేసింది. అదే ఇరాన్‌లోనూ సక్సెస్ అవుతుందని భావించింది. కానీ ఇక్కడ కథ మారిపోయింది. ఇరాన్ ప్రతీకారంతో దెబ్బతీసింది, ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుంది, మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై, అలాగే వారితో రహస్యంగా చేతులు కలిపి తమ భౌగోళిక స్థానం రక్షిస్తుందని భావించిన అరబ్ రాజ్యాలపై కూడా దాడులు చేసింది. దశాబ్దాలుగా ఇరాన్ అమెరికా ఆంక్షల కింద ఉంది. ఆంక్షలు ఒక దేశాన్ని లొంగదీసుకోవడానికి విధిస్తారు. అయితే, అవి ఇరాన్‌కు అసాధారణమైన సహనం, మధ్యస్థాయి సృజనాత్మకత, అమెరికా బెదిరింపుల పట్ల ఎంతమాత్రం బెదరని వైఖరిని నేర్పాయి. నలభై ఏళ్ల శిక్షలను అనుభవించిన తర్వాత, అదనపు శిక్ష అనేది కేవలం మరో సాధారణ రోజు మాత్రమే.

అమెరికాకు చెప్పిన గుణపాఠం

ఇప్పుడు హార్ముజ్ జలసంధి మూసేశారు. ధనిక అమెరికా అనుకూల గల్ఫ్ దేశాలు, తమకు ఎన్నడూ మిత్రుడు కాని పొరుగు దేశం లోపలి నుండి తలుపు మూసివేయడం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుంటున్నాయి. వారి భద్రతా హామీదారు తమ స్థావరాలను కూడా భద్రపరచలేక, యుద్ధాన్ని ఆపడానికి వేడుకుంటున్నారు. ఇరాన్ వేడుకోవడం లేదు. ఇరాన్ టోల్ వసూలు చేస్తోంది. ఆ టోల్ చాలా భారీగా ఉంది. దీన్ని బట్టి శాంతి కోసం ఎవరు బతిమాలుతున్నారో ఊహించుకోవచ్చు. గతేడాది మేలో పాకిస్తాన్ ట్రంప్‌కు ఫోన్ చేసినట్లే, ఈ నెలలో ట్రంప్ మరోసారి పాకిస్తాన్‌కు ఫోన్ చేశారు. పాత్రలు మారాయి. కానీ నిరాశ మారలేదు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం ఇప్పుడు ఆంక్షలకు గురై, నగదు కొరతతో, నిర్మాణపరంగా బలహీనంగా ఉన్న పాకిస్తాన్‌ను తమ తరపున ఇరాన్ తో మాట్లాడమని కోరుతోంది. దీనికి పాకిస్తాన్ ఒప్పుకుంది, ఎందుకంటే తాను ఉపయోగపడ్డానని అది భావించింది. అయితే ఇరాన్ చర్చలకు నో చెప్పేసింది.

Donald Trump s Defeat Why Iran is Winning the Middle East War and America is Desperate

ఇరాన్ వార్ విజేత ఎవరంటే?

ట్రంప్ దూతలుగా స్టీవ్ విట్‌కాఫ్, ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్ పాకిస్తాన్ వెళ్లారు. అమెరికా ఇచ్చిన 15-సూత్రాల సీజ్ ఫైర్ ప్లాన్ ను పాకిస్తాన్ ద్వారా ఇరాన్ కు పంపింది. ఇరాన్ దాన్నీ తోసిపుచ్చింది. అంతటితో ఆగకుండా ఎదురు షరతులు చెప్పింది. హార్ముజ్ జలసంధి ట్రాఫిక్‌పై శాశ్వత నియంత్రణ, ఈ ప్రాంతం నుండి అమెరికా సైనిక స్థావరాలను పూర్తిగా మూసేయడం, యుద్ద నష్టాలకు పరిహారం, భవిష్యత్తులో దాడులు ఉండవన్న హామీ ఇలా చాలానే ఇచ్చింది. దీంతో ట్రంప్ రోజూ ప్రకటనలతో కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాపై నమ్మకం పోయిన సౌదీ సహా గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్ తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీంతో చివరికి హార్ముజ్ తో సంబంధం లేకుండా త్వరలోనే యుద్దం ముగిస్తామని ట్రంప్ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. మరికొన్నిరోజులు ఇరాన్ ఓపిక పడితే చాలు గెలిచేలా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+