Australia Rains: ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు.. వరదలతో మునిగిన ఎయిర్‍పోర్ట్..
ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జాస్పర్ తుఫాన్ తో క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. గ్రేట్ బారియర్ రీఫ్‌తో పాటు ఆస్ట్రేలియా ఈశాన్య ప్రాంతంలోని పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన అనేక ప్రాంతాలను మూసివేశారు. జాస్పర్ తుఫాన్ తో క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలోని ఉత్తరాన అతి భారీ వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాల్లో మీటర్ లోతు వరద నీరు నిలిచిపోయింది.
భారీ వరదల కారణంగా కొంత మంది ఇళ్ల పైకప్పులపైకి ఎక్కేశారు. "సమస్య ఏమిటంటే వర్షం ఆగదు. అది తగ్గే వరకు మేము మారుమూల ప్రాంతాలకు వైమానిక ద్వారా సహాయం చేయలేం మేము చాలా ప్రకృతి వైపరీత్యాలను చూస్తాము" అని రాష్ట్ర ప్రీమియర్ స్టీవెన్ మైల్స్ అన్నారు. 24 గంటల వ్యవధిలో బ్లాక్ మౌంటైన్‌లో 625 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసినట్లు తెలిపింది.

కెయిర్న్స్ ఎయిర్‌పోర్టులో భారీగా వరద నీరు చేరింది. దీంతో విమానాశ్రాయాన్ని మూసివేశారు. టార్మాక్‌లో విమానాలు పాక్షికంగా మునిగిపోయాయి. అటర్ పంపులతో ఆదివారం నుంచి నీటిని తరలిస్తున్నారు. అయితే "ఇది ఇప్పటికీ వచ్చిన నీటి పరిమాణానికి అనుగుణంగా లేదు" అని విమానాశ్రయం యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ బార్కర్ అన్నారు. వరదల కారణంగా సుమారు 5,000 మంది నిర్వాసితులయ్యారు.
జాస్పర్ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉన్నందున, కొన్ని ప్రాంతాలలో ఆరు గంటల్లో 300 మిమీ (12 అంగుళాలు) వర్షం కురుస్తుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. నదులు 1977 నాటి రికార్డులను బద్దలు కొట్టే విధంగా భారీ వరద వస్తున్నట్లు చెబుతున్నారు. ఇంఘమ్‌లో పరిరక్షణ అధికారులు గ్యాస్ స్టేషన్ కాలువలో వద్ద 2.8-మీ (9-అడుగులు) పొడవు గల మొసలిని బంధించారు. ఉత్తర క్వీన్స్‌ల్యాండ్‌లో మొసళ్లు గ్రామీణ ప్రాంతాల్లోని నదులు, మడుగులు, చిత్తడి నేలల్లో ఎక్కువగా కనిపిస్తాయి.












Click it and Unblock the Notifications