వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్ వికటించి పుతిన్ కూతురు మృతి? రష్యా తయారీ ‘స్పుత్నిక్-వీ’ సేఫ్ కాదా? అసలు నిజం ఏంటంటే..

|
Google Oneindia TeluguNews

యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తూ.. అమెరికా, చైనా కంటే ముందుగానే కరోనా వ్యాక్సిన్ ప్రకటించింది రష్యా. స్పుత్నిక్-వీ పేరుతో రూపొందిన ఆ వ్యాక్సిన్ మొదటి డోసును అధ్యక్షుడు పుతిన్ కూతురికి అందించారు. ఈనెల 11న మాస్కోలో జరిగిన ప్రెస్ మీట్ లో పుతిన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడంచారు. అయితే డోసు తీసుకున్న మూడు రోజులకే వికటించడంతో పుతిన్ కూతురు మరణించిందంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నాయి.

Recommended Video

: Fact Check : Did Putin’s Daughter Die After Taking COVID-19 Vaccine?

చంద్రబాబుకు మోదీ సర్కార్ ఝలక్? - ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ - అసలుకే ఎసరు?

స్పుత్నిక్-వీ సేఫేనా?

స్పుత్నిక్-వీ సేఫేనా?

స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ను లాంచ్ చేసిన మొదటి రోజు నుంచే ప్రకటించన రోజు నుంచే పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ధిష్ట పద్ధతుల్లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండానే రష్యా వ్యాక్సిన్ ను ప్రకటించిందని, దాన్ని వాడితే ఉన్నరోగం తగ్గకపోగా కొత్త సమస్యలు వచ్చే అవకాశముందని అమెరికా, యూరప్ దేశాలకు చెందిన పలువురు సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. దీంతో, ప్రపంచంలోనే మొదటి కరోనా వ్యాక్సిన్ అంటూ రష్యా చేసిన ప్రకటనపై చాలా దేశాలు నిరాసక్తత ప్రదర్శించాయి. స్పుత్నిక్ పై అనుమానాలు పెరుగుతున్న వేళ.. పుతిన్ కూతురి వార్తలు సంచలనంగా మారాయి.

ప్రభుత్వం ఏమంటోంది?

ప్రభుత్వం ఏమంటోంది?

రష్యా ఆరోగ్య శాఖ సహకారంతో గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ప్రధానంగా అడినోవైరస్‌ భాగాలతో రూపొందించారు. దాన్ని తీసుకుంటే, రోగనిరోధక శక్తి పెరిగి, శరీరం కరోనాను తట్టుకునే స్థితికి చేరుతుందని రష్యా సైంటిస్టులు చెప్పారు. కాగా, తొలి డోసు తీసుకున్న పుతిన్ కూతురు.. ఈనెల 15న అకాలమరణం చెందిందని పలు అంతర్జాతీయ వెబ్ సైట్లు తప్పుడు వార్తలు రాశాయి. రష్యా ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వకపోవడంతో ఫేక్ న్యూస్ మరింత జోరుగా వ్యాపించాయి. నిజానికి పుతిన్ కూతురు చనిపోలేదని, ఫ్యాక్ట్ ఫైండర్లు వెల్లడించారు. స్పుత్నిక్ వల్ల ఇప్పటిదాకా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, అమెరికా, చైనా అనుకూల లాబీయింగ్ రష్యాకు వ్యతిరేకంగా నెరపే కుట్రల్లో భాగంగానే ఇలాంటి ఫేక్ వార్తలు సృష్టించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రామ్ పోతినేనికి వైసీపీ బెదిరింపులు - కుల కరోనాపైనా చంద్రబాబు - రాయపాటి శైలజ షాకింగ్ కామెంట్స్రామ్ పోతినేనికి వైసీపీ బెదిరింపులు - కుల కరోనాపైనా చంద్రబాబు - రాయపాటి శైలజ షాకింగ్ కామెంట్స్

పుతిన్ కూతురిపై ఫేక్ వెల్లువ..

పుతిన్ కూతురిపై ఫేక్ వెల్లువ..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఇద్దరు కూతుళ్లు. మారియా(35), కేథరిన్(33). ఈ ఇద్దరిలో ఒకరికి కరోనా వ్యాక్సిన్ అందించామని చెప్పిన పుతిన్.. పేరును మాత్రం వెల్లడించలేదు. రష్యా కరోనా వైరస్ ప్రకటించిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలైంది. ఎర్ర టీషర్ట్, బ్లూ షార్ట్స్ ధరించి వ్యాక్సిన్ డోస్ తీసుకున్న ఆ యువతిని పుతిన్ కూతురంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని ఆలస్యంగా వెల్లడైంది. మొత్తంగా స్పుత్నిక్-వీ ప్రకటన తర్వాత పుతిన్ కూతురు కేంద్రంగా ఫేక్ వార్తలు వెల్లువలా పొంగుతున్నాయి. ఓవైపు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తూనే, సెప్టెంబర్-అక్టోబర్ నాటికి స్పుత్నిక్-వీ వాణిజ్య ఉత్పత్తిని కూడా ప్రారంభించేలా రష్యా ప్లాన్ సిద్ధం చేసింది.

English summary
fake news spread over Russian President Vladimir Putin’s daughter that she died after taking russia covid-19 vaccine sputnik-v. On Aug. 15, unverified claim about Putin’s daughter started to circulate on social media. some web sites creats this fake news. Putin’s daughter did not die after taking COVID-19 vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X