వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదేళ్ల వరకు సంక్షేమం లేదు: వలసదారులకు షాకిచ్చిన ట్రంప్

తమ దేశానికి వలస వచ్చే విదేశీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో షాకిచ్చారు. తమ దేశానికి వచ్చే వలసదారులు తొలి ఐదేళ్లలో ఎలాంటి సంక్షేమ పథకాలు పొందలేరని ట్రంప్‌ స్పష్టం చేశారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: తమ దేశానికి వలస వచ్చే విదేశీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో షాకిచ్చారు. తమ దేశానికి వచ్చే వలసదారులు తొలి ఐదేళ్లలో ఎలాంటి సంక్షేమ పథకాలు పొందలేరని ట్రంప్‌ స్పష్టం చేశారు.

'మీరు మా దేశానికి వచ్చిన తర్వాత ఐదేళ్ల వరకు ఎలాంటి సంక్షేమాలు వర్తించవు. గతంలో లాగా వచ్చిన వెంటనే సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడం ఇకపై ఉండదు' అని ట్రంప్‌ తన వారాంతపు రేడియో, వెబ్‌ ప్రసంగంలో తేల్చి చెప్పారు.

For first five years migrants will not get welfare, says Trump

కాగా, అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు ఇచ్చే గ్రీన్‌కార్డు జారీ విధానంలో మార్పులకు ట్రంప్‌ ఇటీవల మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న లాటరీ విధానం కాకుండా మెరిట్‌ ఆధారంగా గ్రీన్‌కార్డు ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం 'రైజ్‌' అనే చట్టాన్ని తీసుకురానుంది.

ఈ చట్టం అమలైతే.. ఇకపై గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంగ్లిష్‌ భాష పరిజ్ఞానం, ఆదాయం, ఉద్యోగం, వయసు వంటి వాటిని చూసి మెరిట్‌ జాబితాను తయారుచేస్తారు. దీని ఆధారంగా కార్డులను జారీ చేస్తారు. ఈ విధానం వల్ల బారతీయుల పెద్దగా నష్టం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. మరికొందరు ఈ విధానంతో అమెరికా వెళ్లే భారతీయులకు మేలే కలిగిస్తుందని చెబుతున్నారు.

English summary
Migrants will not get welfare services in the first five years after they arrive in the US, said President Donald Trump days after announcing his support to a merit-based immigration system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X