Firing: అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురు మృతి..
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మైనేలోని ఒక ఇంటిలో మంగళవారం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆ తర్వాత హైవేపై వెళ్తున్న వాహనాలపై కూడా కాల్పులు జరిగాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు అంతర్రాష్ట్ర రహదారిలో కొంత భాగాన్ని మూసివేశారు. సాధారణ పౌరులు ఎవరు బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. సాధారణ ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని అధికారులు నిర్ధారించుకున్న తర్వాత నిషేదాజ్ఞలు ఎత్తేశారు. దాదాపు 90 నిమిషాలు పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆదీనంలోకి తీసుకున్నారు.

మైనేలో బోడోయిన్‌కు చెందిన జోసెఫ్ ఈటన్ 34 కాల్పులకు తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఈ కాల్పులకు కారణాలు తెలియరాలేదు. మరో వైపు యర్‌మౌత్‌లోని ఇంటర్‌స్టేట్ 295లో దక్షిణాన 40 కిలోమీటర్ల దూరంలో కాల్పులతో జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. కొందరు పొడవాటి రైఫిళ్లను తీసుకుని హైవే పైకి వచ్చి కాల్పులు జరిపారని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. ఆఫ్-ర్యాంప్ వద్ద భారీగా సాయుధ అధికారులు విండ్‌షీల్డ్‌లో స్పష్టంగా బుల్లెట్ రంధ్రాలు ఉన్న కారు గుర్తించారు.
కొద్ది రోజుల క్రితం అమెరికాలో బర్త్ డే పార్టీ సందర్భంగా జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. US మీడియా ప్రకారం, టెలివిజన్ స్టేషన్ WRBL ఆదివారం తెల్లవారుజామున అలబామాలోని డాడెవిల్లేలో కాల్పులు జరిగాయి. గాయపడిన వారిలో ఎక్కువగ యువత ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు కాల్పులు జరిగాయి. ఒక యువకుడి పుట్టినరోజు వేడుకలో కాల్పులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

కొద్దిరోజుల క్రితం అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. నాష్‌విల్లేలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఓ మహిళా దుండగురాలు కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా 6 మంది మరణించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆమె మరణించారు. ఈ ఘటన జరిగిన పాఠశాల ప్రీ స్కూల్. అందులో చదువుతున్న పిల్లలంతా 12 ఏళ్లలోపు వారే ఉన్నారు.
-
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
సాక్షాత్ FBI చీఫ్ కే దిక్కులేదు- ఇరాన్ హ్యాకర్ల పంజా -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications