కుళ్లిన తల్లి శవం పక్కనే జీవిస్తూ ఫ్రెంచ్ మహిళ

స్థానిక పత్రిక లా టెలిగ్రామ్ కథనం ప్రకారం - ఫ్రాన్స్‌లోని బ్రట్టనే పట్టణం మెల్ కార్థియిక్స్‌లో ఓ ఇల్లు పాడుబడి ఉండడాన్ని శుక్రవారంనాడు గమనించిన పోలీసులు ఓ మహిళ శవంతో పాటు ఉంటున్నట్లు కనిపెట్టారు.
ఏళ్ల తరబడి చెత్త పేరుకుపోయి ఉండడంతో, బిల్లులు చెల్లించకపోవడంతో జోక్యానికి ఇరుగుపొరుగువారు పోలీసులను కోరినట్లు ఇండిపెండెంట్ రాసింది. తమను చూడగానే మహిళ అయోమయానికి గురైందని పోలీసులు చెప్పారు
ఇంటిలో చెత్త సంచుల మూటలు కనిపించాయని, పై అంతస్థులో ఆమె తల్లి శవం కనిపించిందని, శవాన్ని కుర్చిలో కూర్చోబెట్టినట్లుందని వారు చెప్పారు. శవం కుళ్లిపోయి ఉందని చెప్పారు. తమ కాలంలో ఆలోచనకు కూడా తట్టని విషయమని స్థానిక మేయర్ మైఖెల్ హెన్రీ చెప్పారు. తల్లి చనిపోయిందని చెప్పకుండా సాధారణంగానే ఆ మహిళ జీవిస్తూ వస్తోంది.












Click it and Unblock the Notifications