వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెలాఖరులో ట్రంప్ తో మోఢీ బేటీ, హెచ్ 1 బీ వీసాలపై స్పష్టత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెలాఖరులో సమావేశం కానున్నారు.ఈ నెల 26న, మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశం కానున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెలాఖరులో సమావేశం కానున్నారు.ఈ నెల 26న, మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశం కానున్నారు. తొలిసారి ట్రంప్ తో మోడీ సమావేశం కానున్న నేపథ్యంలో హెచ్ 1 బీ వీసా విషయం ప్రధానాంశం కాదని టాప్ అమెరికన్ బిజినెస్ అడ్వకసీ గ్రూప్ అభిప్రాయపడింది.మరోవైపు హెచ్ 1 బీ వీసాలపై ఈ సమావేశంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హెచ్ 1 బీ వీసాలపై నిబంధనలను కఠినతరం చేశారు. ఈ కఠిన నిబంధలన కారణంగా దేశీయ సాఫ్ట్ వేర్ కంపెనీలు, టెక్కీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

donald trump

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హమీ మేరకు అమెరికన్లకే ఉద్యోగాలు కల్పిస్తామని ట్రంప్ ఇచ్చిన హమీ మేరకు ట్రంప్ నిర్ణయాలు తీసుకొన్నారు. ఈ నిర్ణయాలతో ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

అయితే ఇరునేతల చర్చలు విజయవంతమౌతాయని అమెరికన్ బిజినెస్ అడ్వకసీ గ్రూప్ అభిప్రాయపడింది.ఇరు దేశాలకు ప్రయోజనం కలిగేలా ఈ పర్యటన సాగుతోందని ప్రముఖ భారతీయ వ్యాపార మండలి (యూఎస్ఐబీసీ) ప్రెసిడెంట్ ముఖేష్ అఘి చెప్పారు.

అమెరికాలో యూఎస్ఐబీసీ ప్రముఖ వ్యాపార విభాగంగా పనిచేస్తోంది. ఈ నెల 26న, ప్రధానమంత్రి మోడీ ట్రంప్ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉగ్రవాదం, హెచ్ 1 బీ వీసాల్లో మార్పుల వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అయితే ఇరునేతల చర్చల్లో హెచ్ 1 బీ వీసా ప్రధానాంశం కాదన్నారు అఘి,

ఇరునేతల సమావేశంలో హెచ్ 1 బీ వీసాల విషయం సమస్యను సృష్టిస్తోందని తాను భావించడం లేదన్నారు. మరింత సమర్థవంతంగా మరింత పోటీతత్వ మార్కెట్ గా మారడానికి అమెరికా ఇండస్ట్రీకి టెక్నికల్ వనరులు అవసరం.

ఇదే సమయంలో భారత్ నుండి ఈ వనరులు సమృద్దిగా ఉన్నాయి. హెచ్ 1 బీ వీసా విషయం కేవలం అమెరికా సమస్యే కాదన్నారు. అమెరికా బిజినెన్ కమ్యూనిటీ సమస్యగా చెప్పారు. హెచ్ 1 బీ వీసాల విషయంలో మోడీ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
The H-1B visa programme is unlikely to be a thorny issue in the maiden meeting between US President Donald Trump and Prime Minister Narendra Modi and the talks could yield a "win-win formula" for both the sides, a top American business advocacy group today said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X