సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' సినిమా చేస్తోంది. నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ వస్తోంది సామ్. 2010 లో ఏమాయె చేశావే చిత్రంతో సమంత టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అనంతరం బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అటు తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది సమంత.
ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' మూవీ ప్రొమోషన్స్ లో బిజీగా ఉంది సమంత. ఈ సినిమాని స్వయంగా సమంత తన సొంత 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్ పై నిర్మిస్తోంది. అయితే.. ఈ సినిమా మే 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా యాంకర్ సుమ, సమంత, డైరెక్టర్ నందినీ రెడ్డి కలిసి 'ఉగాది పచ్చడి చేయడం ఎలా..? అనే దానిపై' ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో సమంత తాను ఉగాది పచ్చడి చేసినట్లు తన భర్తకు వీడియో కాల్ చేసింది.

ఆ వీడియోలో రాజ్ నిడిమోరును సమంత బాబూ అని ముద్దుగా పిలుస్తోంది. దాంతో భర్త రాజ్ నిడిమోరుకు సమంత బాబూ అని ముద్దు పేరు పెట్టినట్లు స్పష్టం అవుతోంది. హాయ్ బాబూ.. నేను ఉగాది పచ్చడి చేశాను అని వీడియోలో చూపించింది సమంత. దాంతో రాజ్.. నువ్వు చేశావా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో ఈ క్యూట్ వీడియో వైరల్ గా మారింది. ఈ మేరకు నెటిజన్లు హ్యాపీ ఉగాది అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications