‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు

ప్రస్తుతం సినిమా హాళ్లలో ఎక్కడ చూసినా 'ధురంధర్‌: ది రివెంజ్‌' నామస్మరణే వినిపిస్తోంది. ప్రీమియర్ షోల నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఊహకందని మలుపులతో ప్రేక్షకులను కూర్చీ అంచులమీద కూర్చోబెడుతోంది. థియేటర్లన్నీ దద్దరిల్లిపోతున్నాయి. దర్శకుడు ఆదిత్యధర్ చెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లోని అసలు సిసలు హైలైట్స్ ఏంటి? అవి ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయనేది తెలుసుకుందాం.

భగవద్గీత సారాంశమే

ఈ సినిమా ఆత్మ మొత్తం భగవద్గీతలోని 'కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన' అనే ఒక్క శ్లోకంలోనే ఇమిడి ఉంది. ప్రతిఫలాన్ని ఆశించకుండా ధర్మం కోసం పోరాడటమే పరమావధిగా కథానాయకుడి పాత్ర సాగుతుంది. జీవితంలో సర్వస్వం కోల్పోయి, ఏ గుర్తింపు లేకపోయినా దేశం కోసం నిలబడే ఒక యోధుడి ప్రయాణం, శక్తిమంతమైన నిర్ణయాలు ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచాయి. ఈ పాత్రలో రణవీర్ సింగ్ అద్భుతంగా నటించాడు. దర్శకుడు ఆదిత్యధర్ చాలా తెలివిగా కేవలం ఫిక్షన్ మీద ఆధారపడలేదు.

Ranveer Singh Here are the highlights from movie Dhurandhar 2 Theaters are roaring

నేపాల్ సరిహద్దుల ద్వారా వచ్చే నకిలీ నోట్లు, మాదకద్రవ్యాల నెట్‌వర్క్, ఉగ్రవాదులకు వస్తున్న ఫండింగ్ వంటి వాస్తవ పరిస్థితులను కథలో చక్కగా చూపించారు. పెద్ద నోట్ల రద్దు వెనుక ఉన్న బలమైన వ్యూహాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చూపించడం విశేషం. కాందహార్ హైజాక్ నుంచి, 26/11 దాడుల వరకు పాక్ కుట్రలను ఎలాంటి ఫిల్టర్లు లేకుండా యథాతథంగా రీక్రియేట్ చేసిన సాహసం మెచ్చుకోవచ్చు.

ఎక్కడా బోర్ కొట్టదు

నాలుగు గంటల సేపు సినిమా ఉన్నా కథను ఛాప్టర్లవారీగా చెప్పడం వల్ల ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీలవ్వడు. మొదటి భాగంలో ధురంధర్ ప్రపంచాన్ని పరిచయం చేస్తూనే, ఆ తర్వాత ప్రతి అధ్యాయంలో కథలోని లోతును, పాత్రల తీవ్రతను పెంచుకుంటూ వెళ్లారు. ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం పాత్రను చూపించిన తీరు దర్శకుడి ఊహకు నిదర్శనం. సినిమాలో కీలక సన్నివేశాలకు పాత హిందీ క్లాసిక్ పాటలను వాడుకోవడం, యాక్షన్ సీక్వెన్స్‌లో లవ్ సాంగ్స్ పెట్టాలనే వినూత్న ఆలోచన సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. ఇక హమ్జా సాగించే మైండ్ గేమ్ ప్రేక్షకుడిని మంత్రముగ్ధుడిని చేస్తుంది.

దద్దరిల్లిన థియేటర్లు

మాధవన్ 'భారత్ మాతాకీ జై' అన్నప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. సంజయ్ దత్ వేసే స్కెచ్‌లకు ప్రతిగా హమ్జా వేసే ప్లాన్ అదిరిపోతుంది. "నీ దేశాన్ని నాశనం చేయడానికి రాలేదు.. మన దేశాలను నాశనం చేస్తున్న వారిని అంతం చేయడానికి వచ్చాను" అని హమ్జా చెప్పే డైలాగ్ పాత్రకు పరిపూర్ణతను ఇచ్చింది. జమీల్ జమాల్ పాత్ర, ఉజెయిర్ బలోచ్ ముగింపు సినిమాకు క్లైమాక్స్ కిక్కును ఇస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+