ఇజ్రాయెల్ బిగ్ బ్రేక్ త్రూ

Hashem Safieddine: ఇజ్రాయెల్ మరోసారి పంజా విసిరింది. మొన్నటి వరకు హమాస్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా పని పట్టింది. లెబనాన్‌పై భారీగా దాడులు సాగిస్తోంది. అత్యాధునిక డ్రోన్లు, మానవ రహిత ఏరియల్ వెహికల్స్‌తో బాంబుల వర్షాన్ని కురిపించింది.

ఈ ఘటనలో హెజ్బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చీఫ్ హషెమ్ షఫియొద్దీన్ దుర్మరణం పాలయ్యారు. లెబనాన్ రాజధాని బీరుట్‌లో గల హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై సాగించిన డ్రోన్ దాడుల్లో ఆయన హతం అయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

Hezbollah leader Hashem Safieddine was killed in an Israeli airstrike on Beirut

ఈ నెల 4వ తేదీన బీరుట్ దక్షిణ ప్రాంతంపై నిర్వహించిన దాడుల్లో షఫియొద్దీన్ మరణించినట్లు తాజాగా వెల్లడించింది ఐడీఎఫ్. అప్పటి దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డాడని, చికిత్స పొందుతూ ఇప్పుడు మరణించాడని పేర్కొంది. షఫియొద్దీన్‌తో పాటు హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ కమాండర్ హుస్సేన్ అలీ హజీమా కూడా మృతిచెందారు.

హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాకు సమీప బంధువు.. షఫియొద్దీన్. హెజ్బొల్లాలో అత్యున్నతమైన షురా కౌన్సిల్ చీఫ్ హెడ్‌గా వ్యవహరించాడు. కిందటి నెల 27వ తేదీన బీరుట్‌పై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో నస్రల్లా దుర్మరణం పాలైన అనంతరం ఆయన వారసుడిగా షఫియొద్దీన్‌ను ప్రకటించాలని నిర్ణయించింది హెజ్బొల్లా. ఇప్పటికే సెక్రెటరీ ఇన్ జనరల్‌గా అపాయింట్ చేసింది.

ఆయనను చీఫ్‌గా నియమించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చంటూ వార్తలు వస్తోన్న పరిస్థితుల్లో ఆయనను కూడా హతమార్చడం కీలక మలుపుగా భావిస్తోన్నారు.

ఈ పరిస్థితుల్లో షఫియొద్దీన్‌ను కూడా మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనితో హెజ్బొల్లాకు నాయకత్వం లేకుండా పోయినట్టయింది. కిందటి నెల బీరూట్ సమీపంలోని దహియెలో నిర్వహించిన దాడుల్లో నస్రల్లాతో పాటు హెజ్బొల్లా సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ కర్కీ మృతిచెందారు.

ఇటీవలే గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల్లో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ మరణించారు. అంతకుముందు హమాస్ పొలిటికల్ వింగ్ హెడ్ ఇస్మాయిల్ హనియే మృతిచెందారు. ఒక చేత్తో హమాస్, మరో చేత్తో హెజ్బొల్లాపై ఏకకాలంలో దాడులు సాగిస్తూ ఈ రెండు మిలిటెంట్ గ్రూప్‌లను దాదాపుగా నిర్మూలిస్తోంది ఇజ్రాయెల్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+