Hormuz: హార్ముజ్ లో సీమైన్స్ కనిపెట్టలేం..! చర్చల వేళ బాంబుపేల్చిన ఇరాన్..!
ఇరాన్ (Iran)పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం 40 రోజుల పాటు సాగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి హార్ముజ్ జలసంధి (strait of hormuz). ఈ అంతర్జాతీయ జలసంధిపై ఇరాన్ పట్టుబిగించడం, అందులో సీమైన్లు పెట్టి భారత్ సహా ఐదారు దేశాల నౌకల్ని మాత్రమే అనుమతించడంతో అమెరికా-ఇజ్రాయెల్ సహా వారి మిత్రదేశాలకు చుక్కలు కనిపించాయి. బలవంతంగా హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తే సముద్ర గర్భంలో పెట్టిన సీమైన్స్ పేలిపోయి నౌకలు ముక్కలయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో అటు వెళ్లాలంటేనే భయపడే పరిస్ధితి ఎదురైంది.
అయితే హార్ముజ్ జలసంధిని తెరవాలనే కండిషన్ తో ఇరాన్ తో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న అమెరికాకు ఇప్పుడు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. దీనికి కారణం అప్పట్లో సముద్రంలో నౌకల్ని పేల్చేయడానికి ఇరాన్ పెట్టిన సీమైన్స్ ఇప్పుడు కనిపించడం లేదట. వాటిని గుర్తించి తొలగించడం అసాధ్యమని ఇరాన్ తేల్చేస్తోంది. దీంతో ఇప్పుడు ఇరాన్ తో చర్చలకు పాకిస్తాన్ వెళ్లిన అమెరికా ప్రతినిధి బృందం ఇరుకునపడింది.

హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడం కష్టమని చెబుతున్న ఇరాన్.. అందుకు యుద్ధ సమయంలో అమర్చిన నావికా మందుపాతరలన్నింటినీ గుర్తించలేకపోవడం, వాటిని తొలగించే సాంకేతిక సామర్థ్యం లేకపోవడమేనని అమెరికా అధికారులు 'ది న్యూయార్క్ టైమ్స్'కు తెలిపారు. ఈ సమస్య గత నెల నుండే మొదలైంది. ఇరాన్ పై యుద్దం మొదలుపెట్టగానే ఆ దేశం
చిన్న పడవలను ఉపయోగించి ఆ జలమార్గంలో మందుపాతరలను అమర్చడం ప్రారంభించింది. అప్పుడు కూడా, ఈ ఆపరేషన్ వేగంగా గానీ, సమర్థవంతంగా గానీ జరగలేదని అమెరికా అధికారులు పేర్కొన్నారు.

మందుపాతరలు అమర్చక ముందే అంతరాయం మొదలైంది. మందుపాతరలను అమర్చిన తర్వాత, దాని ప్రభావం మరింత తీవ్రమైంది. ట్యాంకర్ల రాకపోకలు తీవ్రంగా తగ్గిపోయాయి, దీనికి తోడు ఇరాన్ డ్రోన్ ,క్షిపణి దాడుల ముప్పు ప్రమాదాన్ని మరింత పెంచింది. రవాణాపై ఏర్పడిన ఈ ఒత్తిడి, సంఘర్షణ సమయంలో టెహ్రాన్‌కు గణనీయమైన బలాన్ని చేకూర్చింది. అయినా , అదే వ్యూహం ఇప్పుడు ఇరాన్ అవకాశాలను పరిమితం చేస్తోంది. మందుపాతరలను చెల్లాచెదురుగా, అస్తవ్యస్తంగా అమర్చారని అమెరికా అధికారులు తెలిపారు. వాటి ప్రభావం ఇంకా అస్పష్టంగానే ఉంది.












Click it and Unblock the Notifications