Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

US Drone: అమెరికాకు భారీ షాక్- హార్ముజ్ పై రూ.1850 కోట్ల డ్రోన్ మాయం..!

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దానికి తాజాగా సీజ్ ఫైర్ తో బ్రేక్ పడిందని అనుకుంటున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని తెరవాలనే డిమాండ్ తో సీజ్ ఫైర్ ప్రకటించిన అమెరికాకు ఇవాళ అక్కడే భారీ ఎదురుదెబ్బ తగిలింది. హార్ముజ్ జలసంధిలో నౌకల ట్రాఫిక్ ను తెలుసుకునేందుకు అమెరికా పంపిన రూ.1852 కోట్లు (200 మిలియన్ డాలర్లు) విలువైన అత్యాధునిక డ్రోన్ (spy Drone) అనూహ్యంగా మాయమైంది.

అమెరికా ఖరీదైన డ్రోన్ మాయం (US Drone)

అమెరికా నేవీకి చెందిన నిఘా డ్రోన్, ఎంక్యూ -4సీ ట్రైటాన్ అత్యంత ఖరీదైన విమానం కమ్ డ్రోన్. దీనిని గల్ఫ్ ప్రాంతంలోని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఏరియా కోసం కేటాయించారు. ఇటలీలోని సిగోనెల్లా నావల్ ఎయిర్ స్టేషన్‌లోని స్థావరం నుంచి హార్ముజ్ జలసంధి మీద నిఘా కోసం అమెరికా పంపిన ఈ డ్రోన్ ఇవాళ హఠాత్తుగా మాయమైంది. గాలిలో అత్యవసర హెచ్చరికను ప్రకటించిన కొద్దిసేపటికే హార్ముజ్ జలసంధిపై ఇది అదృశ్యమైంది. పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధిపై సుమారు మూడు గంటల నిఘాను పూర్తి చేసి ఇది ఇటలీలోని తన స్థావరానికి తిరిగి వెళ్తోంది.

US Navy s 200M MQ-4C Triton Spy Drone Vanishes Over Strait of Hormuz After Emergency Signal
ట్రంప్ డెడ్ లైన్ ముగుస్తున్న వేళ రోడ్లపైకి ఇరాన్ ప్రజలు- ఏం చేస్తున్నారంటే ?
ట్రంప్ డెడ్ లైన్ ముగుస్తున్న వేళ రోడ్లపైకి ఇరాన్ ప్రజలు- ఏం చేస్తున్నారంటే ?

కూలిపోయిందా ? కూల్చేశారా ?

ఆన్‌లైన్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24.. ఆ డ్రోన్ 7700 కోడ్ (సాధారణ అత్యవసర పరిస్థితి కోసం) పంపి, కిందకు దిగడం ప్రారంభించినప్పుడు ఇరాన్ వైపు కొద్దిగా మలుపు తీసుకున్నట్లు చూపించింది. మానవరహితమైన ఆ విమానం అదృశ్యమయ్యే ముందు వేగంగా ఎత్తును కోల్పోతున్నట్లు గుర్తించారు. అయితే ఈ డ్రోన్ కూలిపోయిందా లేక కూల్చేశారా అనేది స్పష్టంగా తెలియరాలేదు. ఓడల రాకపోకల కోసం హార్ముజ్‌ను తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించడంతో అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన రెండు రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.

US Navy s 200M MQ-4C Triton Spy Drone Vanishes Over Strait of Hormuz After Emergency Signal
US-Iran Ceasefire: ఇరాన్ సీజ్ ఫైర్ ను చెడగొట్టిన ఇజ్రాయెల్.. ! ట్రంప్ వాట్ నెక్ట్స్ ?
US-Iran Ceasefire: ఇరాన్ సీజ్ ఫైర్ ను చెడగొట్టిన ఇజ్రాయెల్.. ! ట్రంప్ వాట్ నెక్ట్స్ ?

డ్రోన్ ప్రత్యేకతలు ఇవే..

సాంప్రదాయ విమానాలకు భిన్నంగా ఈ ట్రైటాన్ నిఘా డ్రోన్ కీలకమైన జలసంధులపై గంటల తరబడి వ్యూహాత్మక నిఘాకు పనికొస్తుంది. నిరంతర, భారీ-స్థాయి సముద్ర నిఘా కోసం దీన్ని తయారు చేశారు. పీ-8ఏ పోసిడాన్ గస్తీ విమానాలకు ఎత్తైన ప్రదేశాలలో కళ్లుగా ఇది పనిచేస్తుంది. ట్రైటాన్ మాత్రమే 50వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, 24 గంటలకు పైగా, 7,400 నాటికల్ మైళ్ల పరిధితో పనిచేయగల ఏకైక స్వయంప్రతిపత్తి గల అధిక ఎత్తు, సుదీర్ఘ ఓర్పు కలిగిన సముద్ర విమానం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+