US presidential polls: 50 రాష్ట్రాల నుంచి 7కు తగ్గిపోయిన పోటీ.. ! గతంలో ఏం జరిగింది ?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్దమైంది. ఇవాళ జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ తాడోపేడో తేల్చుకోబోతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో హోరాహోరీ తప్పదని ఎప్పుడో తేలిపోయింది. అందులోనూ స్వింగ్ రాష్ట్రాలే విజేతను నిర్ణయించబోతున్నాయనే ప్రచారంతో ఇప్పుడు అందరి దృష్టీ వాటిపైనే ఉంది. అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ వాషింగ్టన్ డీసీతో పాటు 50 రాష్ట్రాల నుంచి కేవలం 7 రాష్ట్రాలకు తగ్గిపోయిందా అన్న చర్చ జరుగుతోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇవాళ భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగున్నరకు మొదలై రేపు ఉదయం ఆరు గంటలకు ముగుస్తాయి. ఇప్పటికే ఈ ఎన్నికల్లో 80 మిలియన్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన ఓటర్లు ఇవాళ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నా అసలు పోటీ మాత్రం ఏడు స్వింగ్ రాష్ట్రాల్లోనే ఉందని మరోసారి తేలిపోయింది. దీంతో ఈ స్వింగ్ ఎవరిని తేల్చబోతోంది, మరెవరిని ముంచబోతోందన్న చర్చ వాడీవేడిగా సాగుతోంది.

how the US presidential poll contest come down to swing states

గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో హోరీహోరీ కారణంగా అసలు పోరు జరిగే స్వింగ్ రాష్ట్రాలకే అమెరికా ఎన్నికలు పరిమితమయ్యాయా అన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ స్వింగ్ రాష్ట్రాలు గతంలో ఎవరి భవిష్యత్తును ఎలా మార్చేశాయో ఓసారి చూద్దాం. ముందుగా అత్యధికంగా 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా కీలకమైన రాష్ట్రం. అక్కడ ఆధిక్యం తెచ్చుకోలేకపోతే ఇక అధ్యక్ష ఎన్నికల్లో ఓడినట్లే.

ఆ తర్వాత రెండో స్ధానంలో 16 ఎలక్టోరల్ ఓట్ల చొప్పున ఉన్న జార్జియా, నార్త్ కరోలినా ఉన్నాయి. వీటిలో జార్జియా దశాబ్దాల రిపబ్లికన్ ఆధిపత్యం తర్వాత మారిన పరిస్ధితుల్లో 2020లో డెమోక్రాట్ అధ్యక్షుడు బైడెన్ కు అండగా నిలిచింది. అలాగే నార్త్ కరోలినా 2012 నుండి జరిగిన ప్రతి అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్‌లను గెలిపిస్తూ వస్తోంది. 2020లో మాత్రం ట్రంప్ కేవలం 1.3 శాతం పాయింట్లతో స్వల్ప ఆధిక్యం తెచ్చుకున్నారు. వీటి తర్వాత 15 ఎలక్ట్రోరల్ ఓట్లున్న మిచిగాన్ ఓటర్లు 2016లో ట్రంప్‌ను ఎన్నుకున్నా.. 2020లో 2.8 శాతం పాయింట్ల విజయంతో బైడెన్ కు అండగా నిలిచారు.

అలాగే 11 ఓట్లున్న అరిజోనాను 2016లో గెల్చుకున్న ట్రంప్..2020లో మాత్రం బిడెన్‌కు అండగా నిలిచింది. అటు 10 ఓట్లున్న విస్కాన్సిన్ డెమోక్రాట్లకు అండగా నిలుస్తూ వస్తోంది. ఈసారి కూడా ఇక్కడ మార్పు లేకపోవచ్చు. ఇక 6 ఎలక్టోరల్ ఓట్లున్న నెవాడా అత్యంత వైవిధ్యంగా ఉంటుంది. నెవాడాలో డెమొక్రాట్‌లు లేదా రిపబ్లికన్‌ల కంటే తటస్ధ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గతంలో డెమొక్రాట్‌లు ఇక్కడ అధ్యక్ష ఎన్నికల్లో తక్కువ తేడాతో గెలిచారు. అయితే ఈ రాష్ట్రం అంత నిర్ణయాత్మకం కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+