వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదంలో మనిషి జీవితం: రోజుకు మనం ఎంత ప్లాస్టిక్ మింగుతున్నామో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ప్రపంచం కాలుష్యకోరల్లో చిక్కుకుంటోంది. ఎటు చూసినా కాలుష్యమే కనిపిస్తోంది. ఇందుకు కారణం మానవుడే. పచ్చని చెట్లను నరికివేయడం, పెరుగుతున్న పారిశ్రామిక వాడలతో నీరు కలుషితం అవడం, ఇంకా చాలా కారణాలతో మనిషి జీవితమే ప్రమాదస్థాయిలో పడిపోయి ప్రశ్నార్థకంగా మారింది. బయటకు అడుగుపెడితే చాలు వాహనాల నుంచి వచ్చే పొగను పీల్చుకోవాల్సి వస్తోంది. ఇక నదుల్లో నీరు కలుషితం అవుతోంది. ఇందుకు కారణం పలు ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వేస్ట్ మొత్తం నేరుగా నదులకు చేరుతోంది. ఇక నేరుగా మనం తీసుకునే ఆహారం కూడా కలుషితమే అవుతోంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అయినందున మనకు తెలియకుండానే ఎంత ప్లాస్టిక్‌ను మింగేస్తున్నామో తెలిస్తే షాక్ అవుతారు.

 కడుపులోకి ఎంత ప్లాస్టిక్ పంపుతున్నామో తెలుసా..?

కడుపులోకి ఎంత ప్లాస్టిక్ పంపుతున్నామో తెలుసా..?

బయటకు అడుగు పెడితే కాలుష్యం కోరలు చాస్తోంది. మరోవైపు తినే ఆహారం కలుషితం అవుతోంది. ఇలా మనిషి జీవితమే ప్రశ్నార్థకంగా మారుతోంది. తాజాగా మనిషి సగటున ఎన్ని గ్రాముల ప్లాస్టిక్ పొట్టలోకి పంపిస్తున్నాడనే దానిపై ఓ పర్యావరణ చారిటీ సంస్థ పరిశోధన చేసింది. ఇందులో షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. ఆస్ట్రేలియా యూనివర్శిటీ ఆఫ్ న్యూక్యాస్టిల్ చేపట్టిన పరిశోధనల్లో వారానికి ఐదు గ్రాముల ప్లాస్టిక్‌ను ఆహారం రూపంలో కడుపులోకి పంపిస్తున్నామనే విషయం వెలుగు చూసింది. అంటే ఇది ఒక క్రెడిట్ కార్డును అమాంతంగా మింగేసినట్లు అని ఆ సంస్థ వెల్లడించింది.

ప్లాస్టిక్‌తోనే తాగునీరు కలుషితం

ప్లాస్టిక్‌తోనే తాగునీరు కలుషితం

ఇక పర్యావరణంలో ప్లాస్టిక్ కాలుష్యం చాలా ఎక్కువగానే ఉంది. ప్లాస్టిక్‌తో అత్యధికంగా కలుషితం అయ్యేది తాగునీరని ఆస్ట్రేలియా యూనివర్శిటీ తెలిపింది. మరోవైపు షెల్‌ఫిష్‌ను ఆహారంగా తీసుకోవడం వల్ల అది అప్పటికే తిన్న ప్లాస్టిక్‌ను కూడా మనం పరోక్షంగా కడుపులోకి పంపిస్తున్నట్లు పరిశోధన ద్వారా వెల్లడైంది. ఒక 2000వ సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి చాలా ఎక్కువగా జరిగిందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అంతకుముందు సంవత్సరాలన్నీ కలిపితే ఎంత ప్లాస్టిక్ ఉత్పత్తి అయ్యిందో... ఒక్క 2000 సంవత్సరంలోనే అంత ప్లాస్టిక్ ఉత్పత్తి అయ్యిందని పేర్కొంది. ఇందులో మూడోవంతు ప్రకృతిలోకి విడుదల చేయబడిందని నివేదిక వెల్లడించింది.

 అమెరికాలో కుళ్లాయి నీటిలో ఎంత శాతం ప్లాస్టిక్ కలుస్తోందో తెలుసా..?

అమెరికాలో కుళ్లాయి నీటిలో ఎంత శాతం ప్లాస్టిక్ కలుస్తోందో తెలుసా..?

ఒక్క తాగు నీటి నుంచే సగటున మనిషి 1769 కణాల ప్లాస్టిక్‌ను తీసుకుంటున్నట్లు స్టడీ పేర్కొంది. ప్లాస్టిక్ పొల్యూషన్ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉందని పరిశోధకులు తెలిపారు. అయితే ఎక్కడా ప్లాస్టిక్ వల్ల కాలుష్యం లేదని మాత్రం చెప్పలేదు. ప్రతి చోటా ప్లాస్టిక్ పొల్యూషన్ ఉందని నివేదిక ద్వారా తెలుస్తోంది. 52 స్టడీల ద్వారా ఒక అంచనాకు వచ్చినట్లు పరిశోధకులు చెప్పారు. అమెరికాలో 94.4 శాతం కుళ్లాయి నుంచి వచ్చే నీటిలో ప్లాస్టిక్ కణాలు మిళితమై ఉంటున్నట్లు పరిశోధకులు తేల్చారు.లీటర్‌కు సగటున 9.6 ఫైబర్స్ ఉన్నట్లు తెలిపారు. ఇక యూరోప్‌లో ప్లాస్టిక్ ద్వారా నీటి కలుషితం అవడం కాస్త తక్కువగానే ఉన్నట్లు చెప్పారు. అక్కడ 72.2శాతం మాత్రమే కుళ్లాయి నీళ్లలో ప్లాస్టిక్ కణాలు మిళితమై ఉన్నట్లు తెలిపారు.

English summary
Plastic pollution has turned out to be very dangerous to the humans. Many people on an average are consuming 5 grams of plastic per week stated a report.94.4 percent of Plastic particles were found in tap water samples in US said the study.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X